Senior Producer Chittibabu : వంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సితార’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది భానుప్రియ. తరువాత కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘స్వర్ణకమలం’ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా నాట్య కళాకారిణి కావాడం మరో విశేషం. భానుప్రియ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషలలో దాదాపు 110 చిత్రాలలో నటించింది. తెలుగులో దాదాపుగా అగ్రహీరోల అందరి సరసనా నటించింది. సినిమా పరిశ్రమలో ఆమె జీవితం సాఫీగా సాగిపోయినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇక ఆమె అనారోగ్యంతో ప్రస్తుతం బాధపడుతూండగా ఆమె గురించి ఆసక్తికర విషయాలను నిర్మాత చిట్టిబాబు వివరించారు.

మతిమరుపు తో బాధపడుతున్న భానుప్రియ…
సినిమా జీవితంలో ఎంతో సక్సెస్ చూసిన భానుప్రియ నిజ జీవితంలో మాత్రం బాగా ఒడిదుడుకులను ఎదుర్కొందంటూ చెప్పారు చిట్టిబాబు. ఆమె కళ్ళు ఆమెను స్టార్ హీరోయిన్ ను చేశాయంటూ చెప్పారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె పాప పుట్టాక భర్తతో విడిపోయి ఇండియా వచ్చేసారని, ఇక సినిమాల్లో కూడా తక్కువగానే నటించినట్లు చిట్టిబాబు తెలిపారు. ప్రస్తుతం ఆమె మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. ఏదైనా చెప్పినా కాసేపటికే మర్చిపోతున్నారు అంటూ చెప్పారు.

చికిత్స తీసుకుంటున్నారని అందుకే ఈ మధ్య కాలంలో సినిమాలను కూడా తగ్గించారని చెప్పారు. 80s నటీనటుల రీ యూనియన్ లో కూడా భానుప్రియ కనిపించక పోడానికి కారణాలను చెబుతూ ఆమెకు మతిమరుపు ఉండటం వల్ల మర్చిపోతున్నారని చెప్పారు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన భానుప్రియ ప్రస్తుతం ఇలా అనారోగ్యంతో బాధపడటం బాధాకరం అంటూ ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పారు.






























