Senior Vilan Ponnambalam : కోట్ల ఆస్తులు కోల్పోయి చిన్న గదిలో ఉన్న అలనాటి విలన్… ఆదుకున్న తెలుగు స్టార్ హీరో…!

0
129

Senior Vilan Ponnambalam : విలన్ గా, స్టంట్ మాస్టర్ గా వందల సినిమాల్లో నటించిన నటుడు పొన్నంబలం. తమిళంలో ఎక్కువ సినిమాల్లో నటించిన పొన్నంబలం తెలుగులో ఘరానా మొగుడు, హిట్లర్, మెకానిక్ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, చూసోద్దాం రండి, నువ్వొస్తావని వంటి సినిమాల్లో విలన్ గా నటించారు. ఎన్నో సినిమాల్లో నటిస్తూనే అటు రాజకీయాల్లోను క్రియాశీలకంగా ఉన్న పొన్నం బలం ప్రస్తుతం అనారోగ్య సమయాలతో బాధపడుతూ చిన్న గదిలో ఉన్నారు.

చిరంజీవి గారు ఆదుకున్నారు….

పొన్నం బలం ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు, డబ్బు సంపాదించుకున్నారు. ఆయన కెరీర్ పీక్స్ లో ఉన్నపుడు దాదాపు 8 కార్లు ఆయనతో ఉండేవట. అలాంటి ఆయన రాజకీయాలలోనూ, సినిమాల్లోను ప్రస్తుతం యాక్టీవ్ గా లేరు. అనారోగ్య సమస్యలను వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

అలా ఆస్తులన్నీ పోగొట్టుకునికే చికిత్స కోసం డబ్బు లేక ఇబ్బందులను ఎదుర్కొనే సమయకి చిరంజీవి గారికి విషయం తెలిసీ ఆయనకు ఫోన్ చేసి ఒకటి రెండు కాదు ఏకంగా 50 లక్షల సహాయం చేశారట. ఆయన చేసిన సహాయం వల్ల ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని ఇపుడిప్పుడే మళ్ళీ సినిమాల్లో నటించడానికి సిద్ధమవుతున్నట్లుగా పొన్నం బలం తెలిపారు.