Connect with us

Featured

ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విజయ్ ఆంటోనీ జీవితంలో ఎన్ని విషాదాలు ఉన్నాయో తెలుసా?

Published

on

విజయ్ ఆంటోనీ… ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయి జీవించడానికే అష్టకష్టాలు పడ్డ విజయ్ సినిమా ప్రపంచం లో అడుగుపెట్టి ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈయన మొదటగా సంగీత స్వరకర్త, నేపధ్య గాయకుడు, నటుడు, సినిమా ఎడిటర్, గేయ రచయిత, ఆడియో ఇంజనీర్, చిత్ర నిర్మాతగా సినీ ఇండస్ట్రీ లో పని చేసారు. అతను తమిళ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేస్తున్నాడు. అతను 2005 లో సంగీత దర్శకుడిగా చిత్రరంగంలో అరంగేట్రం చేసాడు. ఇక ఈయన జీవిత నేపథ్యం చూస్తే…

తమిళనాడు లోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్ ‌కోయిల్ ‌లో 1975 జూలై 24న జన్మించాడు. అతని తండ్రి మరణించేనాటికి అతని వయస్సు 7 సంవత్సరాలు అయితే, అతని సోదరి వయస్సు 4 సంవత్సరాలు. దింతో అతని కుటుంబం కష్టాలకు గురి అయింది. అతని తల్లి పిల్లలకు విద్యను అందించడానికి, కుటుంబాన్ని పోషించడానికి ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేది. ఇక విజయ్ ఆంటోనీ లయోలా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నుండి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సౌండ్ ఇంజనీర్ గా విద్యనభ్యసించాడు.

ఇకపోతే విజయ్ ఆంటోని చిన్నప్పటి నుంచే అనేక కష్టాలు ఎదుర్కొని తన నటనా నైపుణ్యంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తనకు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకున్నా, ఎవరి సినీ కుటుంబ నేపథ్యం ఉన్న ఇళ్లలో పుట్టకపోయినా… సినిమాల్లోకి అడుగు పెట్టాడు. చిన్నప్పుడే తన తండ్రి మరణించడంతో అనేక కష్టాలను ఎదుర్కొన్నాడు. ఇకపోతే అతను తన అమ్మని, తల్లిని చెల్లిని కలుసుకోవడానికి వారంలో ఒకసారి మాత్రమే అవకాశం ఉండేదని, అందుకు గల కారణం వారికి అద్దె ఇంట్లో దొరక్కపోవడం. ఇక తన తల్లి ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో విజయ్ ఆంటోని చదువుతున్న సమయంలో తన తల్లికి వేరే ఊరు ట్రాన్సఫర్ అయినా సరే… తన పిల్లల చదువు మానిపించడం ఇష్టం లేక ఉన్నచోటి నుండి ప్రతిరోజు చాలా దూరం ప్రయాణం చేస్తూ ఉద్యోగాన్ని చేశారు.

అలాంటి సమయంలో తన తల్లికి 15 రోజుల పాటు శిక్షణ తరగతులు నిర్వహించారు. అయితే ఆ శిక్షణ తరగతులను హాజరయ్యేందుకు తన తల్లి తనని హాస్టల్లో ఉంచి చదివిందని, చెల్లిని మాత్రం తనతో తీసుకు వెళ్లిందని తెలిపాడు.అయితే అనుకోకుండా తన తల్లి హాస్టల్ లో వదిలి వెళ్ళిన తర్వాత రెండు రోజులకు హాస్టల్ కు సెలవు ఇచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాని అతను, ఆ హాస్టల్ వార్డెన్ సలహా మేరకు శ్రీలంక శరణార్థులు ఉండే శిబిరంలో తాను కూడా తలదాచుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో విజయ్ ఆంటోని కి చిల్లిగవ్వ కూడా చేతిలో లేకపోవడంతో, దీంతో ఆయన ఆ సమయంలో కేవలం అరటి పండ్లు తింటూ జీవనాన్ని కొనసాగించారు.

అప్పుడు అంతా కష్టపడి తన జీవితంలో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ప్రస్తుతం హీరోగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఇక ఆ తర్వాత తన తొలి చిత్రం 2012 లో “నాన్” అయినప్పటికీ, అతను సలీం (2014), పిచైకరన్ (2016), సైతాన్ (2017), యమన్ (2017), కొలైగరన్ (2019) వంటి యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలలో తన పాత్రలను పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు ఉత్తమ సంగీత విభాగంలో “నాక ముక్క” అనే సినిమా ప్రకటనల పాట కోసం 2009 కేన్స్ గోల్డెన్ లయన్‌ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు విజయ్. ఈ పాట ద్వారా అతను బాగా గుర్తింపు పొందాడు. ఇక విజయ్ ఆంటోనీ వివాహం సైతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఫాతిమా అనే ఒక యువతీ విజయ్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన సందర్భం లో ఆమెతో ప్రేమలో పడి 2006 లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి లారా అని ఒక కూతురు కూడా ఉంది.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Kumari Aunty: ఒక వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బ కొట్టిన బిగ్ బాస్ కీర్తి.. దారుణంగా ఉందంటూ?

Published

on

Kumari Aunty: కుమారి ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హైదరాబాద్లో ఫుట్ పాత్ పై ఫుడ్ బిజినెస్ జరుపుకుంటూ ఎంతో ఫేమస్ అయినటువంటి ఈమె ఏకంగా సెలబ్రిటీ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. ఈ పాపులారిటీతో ఏకంగా ఈమె బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసిన విషయం మనకు తెలిసిందే.

అత్యంత తక్కువ ధరలకు ఎంతో రుచికరమైనటువంటి వివిధ రకాల ఆహార పదార్థాలతో కడుపునిండా భోజనం పెడుతూ అందరినీ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఈమె పాపులర్ అయ్యారు ఈమె గురించి ఎన్నో ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు తనని ఇంటర్వ్యూ చేస్తూ తన గురించి చెప్పడంతో పక్క రాష్ట్రాల నుంచి కూడా పలువురు ఈమె వద్ద టెస్ట్ చేయడం కోసం వచ్చేవారు.

ఇలా ఎంతో ఫేమస్ అయినటువంటి కుమారి ఆంటీ గురించి తాజాగా బుల్లితెర నటి బిగ్ బాస్ బ్యూటీ కీర్తి భట్ చేసినటువంటి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇటీవల బిగ్ బాస్ కీర్తి తనకు కాబోయే భర్త విజయ్ కార్తీక్ తో కలసి కుమారి ఆంటీ వద్ద భోజనం చేయడానికి వెళ్ళారు. అయితే వీరు వెళ్లిన సమయంలో కుమారి ఆంటీ లేదని 170 రూపాయలకు వైట్ రైస్ చికెన్ కర్రీ తిన్నామని భోజనం ధర చాలా ఎక్కువగా ఉందని ఈమె తెలిపారు.

Advertisement

రుచి పెద్దగా లేదు…

ఇక ఆ ఫుడ్ తినడానికి పెద్దగా రుచి లేదని దారుణంగా ఉందని తెలిపారు. ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే అసలు తినాలనిపించక పడేసామని మరో ఫుడ్ స్టాల్ వద్దకు వెళ్లి అక్కడ భోజనం చేశామని అది కాస్త బెటర్ గా ఉందని ఈమె తెలిపారు. కుమారి ఆంటీ కంటే నేనే వంట బాగా చేస్తానని కీర్తి తెలిపారు. ఇలా కీర్తి కుమారి ఆంటీ వద్ద ఫుడ్ బాగాలేదు అంటూ చేసినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు ఈమెకు మద్దతు తెలుపుగా మరికొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఈ ఒక్క వీడియోతో కుమారి ఆంటీ బిజినెస్ పై దెబ్బపడిందని చెప్పాలి


Advertisement

Continue Reading

Featured

Ntr: ఎన్టీఆర్ స్టార్ హీరో అవ్వడానికి ఆ అవమానమే కారణమా.. ఏం జరిగిందంటే?

Published

on

Ntr: నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న విషయం తెలిసిందే.

ఇలా స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి ఎన్టీఆర్ నటన పరంగా ఈ స్థాయిలో ఉన్నారు అంటే అందుకు కారణం గతంలో తన తల్లికి తనకు జరిగిన అవమానమే కారణమని తెలుస్తుంది. తమకు జరిగిన అవమానంతోనే ఈయన ఎలాగైనా ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు పొందాలన్న ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి రావడం వెనుక పెద్ద అవమానం జరిగిందని తెలుస్తుంది. సీనియర్ ఎన్టీఆర్ కుటుంబానికి ఇష్టం లేకుండా హరికృష్ణ శాలినిని పెళ్లి చేసుకున్నారు.

ఇక ఎన్టీఆర్ కుటుంబంలో తన చిన్న కుమారుడు వివాహం జరుగుతున్నటువంటి తరుణంలో హరికృష్ణ ఎన్టీఆర్ శాలిని కూడా అవివాహానికి తీసుకువచ్చారట దీంతో వీరిద్దరిని పెళ్లి మండపంలో చూసినటువంటి సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణని పిలిచి వారి ముందే ఈ పెళ్లికి ఎంతో మంది ప్రముఖులు వస్తున్నారు ఇలాంటప్పుడు వీళ్ళని ఇక్కడికి తీసుకురావడం ఏంటి అని అరిచారట దీంతో హరికృష్ణ తిరిగి వారిని వెనక్కి పంపించారు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ అవమానించార…

ఇలా తమకు అందరి ముందు అవమానం కావడంతో ఎలాగైనా నా కొడుకు మంచి స్థాయిలో ఉండాలని అప్పటినుంచి శాలిని తన కుమారుడికి నటనలోనూ డాన్స్ లోనూ శిక్షణ ఇప్పిస్తూ నేడు అందరూ నందమూరి వారసులు అని చెప్పుకునే స్థాయికి తీసుకువచ్చారని తెలుస్తుంది. ఇలా ఎన్టీఆర్ స్టార్ హీరో అవడం వెనుక ఈ అవమానం దాగి ఉందని తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Rakul Preeth singh: రకుల్ ప్రీత్ సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Published

on

Rakul Preeth singh: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటి రకుల్ ప్రీతి సింగ్ ఒకరు. ఈమె కెరటం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వచ్చాయి.

ఈ విధంగా స్టార్ హీరోలు అందరి సరసన నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రకుల్ కేవలం తెలుగు సినిమాలో మాత్రమే కాకుండా తమిళ్ కన్నడ బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలను అందుకుంటు స్టార్ హీరోయిన్గా సక్సెస్ అయ్యారు. ఇకపోతే రకుల్ తాజాగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. గత రాత్రి నుంచి ఈమె పెళ్లి వేడుకలు గోవాలో ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

బాలీవుడ్ నటుడు నిర్మాత జాకీ భగ్నానితో రకుల్ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది ప్రస్తుతం ఈమె పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి అని తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రకుల్ తన రెమ్యూనరేషన్ గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రకుల్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు 3 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

Advertisement

ఈ స్థాయికి రావడానికి వారే కారణం..

ఇలా ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకునే రకుల్ తన కెరియర్ మొదట్లో ఐదు వేల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె హీరోయిన్ కాకముందు మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు ఇలా మోడల్ గా కొనసాగుతున్న సమయంలో తనకు 5000 రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని అదే తన ఫస్ట్ రెమ్యూనరేషన్ అని తెలిపారు. ఇలా 5000 నుంచి ఈ స్థాయికి చేరుకున్నాను అంటే అందుకు కారణం నా తల్లితండ్రులు స్నేహితులు ప్రేక్షకులు అంటూ రకుల్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!