Rithu Chowdhary: యాంకర్ గా తన కెరియర్ మొదలుపెట్టి అనంతరం మోడలింగ్ రంగం వైపు అడుగులు వేసి అలాగే బుల్లితెర సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రీతు చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసింది. అలాగే సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

జబర్దస్త్ కార్యక్రమంలో ఆది స్కిట్లో చేస్తున్నటువంటి ఈమె ఆది ఈ షో నుంచి వెళ్లిపోవడంతో అజర్ టీంలో సందడి చేస్తున్నారు.ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన ఈమె సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.ఇలా తన బాయ్ ఫ్రెండ్ పేరు శ్రీకాంత్ అని అందరికీ పరిచయం చేసిన రీతు ఈ ఫోటో షేర్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయింది. అయితే ఈమె చేసుకోబోయే వ్యక్తి ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయానికి వస్తే…
భారీ ఆస్తుపాస్తులు కలిగిన శ్రీకాంత్..
రీతు చౌదరి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి శ్రీకాంత్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబంలో జన్మించడమే కాకుండా కోట్లలో ఆస్తిపాస్తులు ఉన్నాయని తెలుస్తోంది. ఇలా భారీ బ్యాగ్రౌండ్ ఉన్న శ్రీకాంత్ ను రీతు చౌదరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. అయితే వీరు పెళ్లి ఎప్పుడు ఏంటి అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే రీతు షేర్ చేసిన తన ప్రియుడు ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతుంది.
View this post on Instagram





























