Serial actress Sandra Jaichandran : వైజాగ్ కి చెందిన సాండ్రా మొదట సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా ఆపైన సీరియల్స్ లో చేస్తూ మరింత గుర్తింపు సంపాదించుకుంది. ‘ఆర్య’ సినిమాతో మొదలు పెట్టి ‘హ్యాపీ’ లాంటి సినిమాల్లో చేసిన సాండ్రా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాలో చివరగా నటించింది. ప్రస్తుతం సీరియల్స్ లో బిజీగా ఉన్న సాండ్రా తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి చెప్పారు.

సుసైడ్ చేసుకోవాలనే ఆలోచన వచ్చేది…
ముద్దమందారం సీరియల్ లో ఐశ్వర్య గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సాండ్రా ఆ తరువాత రాధమ్మ కూతురు ప్రస్తుతం శుభస్య శీఘ్రం సీరియల్స్ లో నటిస్తోంది. మధ్య తరగతి చెవిటి అమ్మాయి పాత్రలో నటిస్తూ మెప్పిస్తున్న సాండ్రా తన వ్యక్తగత జీవితం గురించి మాట్లాడుతూ తాను గతంలో డిప్రెషన్ లో ఉన్నపుడు సుసైడ్ ఆలోచనలు వచ్చేవి కానీ చేసుకోలేదని, ఎపుడూ చేసుకోవాలని ప్రయత్నం చేయలేదని అలా సుసైడ్ చేసుకోవాలనే ఆలోచన వస్తే ఇంట్లో వాళ్లతోనో లేక స్నేహితుల దగ్గర నా బాధ చెప్పుకోవడం నేర్చుకున్నానని అప్పటి నుండి ఎలాంటి డిప్రెషన్ లేదని తెలిపారు.

అంతకుముందు ఎవరితోనూ ఎలాంటి ఫీలింగ్స్ పంచుకోక పోవడం వల్ల నాలోనే దాచేసుకోవడం వల్ల చిన్న విషయానికి చాలా ఏడ్చేదాన్ని అంటూ చెప్పారు సాండ్రా. ప్రస్తుతం సినిమాల్లో నటించడం లేదని కేవలం సీరియల్స్ లో మాత్రమే బిజీగా ఉన్నట్లు తెలిపిన ఆమె ఏదైనా బాగా ఇబ్బందిగా అనిపించినా బాధగా అనిపించినా వెంటనే అమ్మకు చెబుతానని తన వద్దే అన్నీ పంచుకోగలనని తెలిపారు. ప్రస్తుతం పని వల్ల అమ్మ నాన్నకి దూరంగా ఉన్నా ఎపుడూ ఎమోషనల్ గా కనెక్ట్ అయి ఉంటాను అంటూ చెప్పారు.




























