Serial Actress: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి వారికి సంబంధించిన ప్రతి ఒక్క సంఘటనను వీడియోగా చిత్రీకరించు సోషల్ మీడియాలో షేర్ చేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఇలా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బుల్లితెర సెలబ్రిటీలైతే ఒక్కొక్కరు ఒక్కో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉన్నారు.

ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా గృహప్రవేశం వీడియో షాపింగ్ వీడియోలు బేబీ బంప్ శ్రీమంతపు వీడియోలు అంటూ ఎన్నో రకాల వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే బుల్లితెర నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి రామిరెడ్డి సైతం యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకున్నారు. అయితే వైష్ణవి గత కొద్ది రోజుల క్రితం మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇలా బాబు పుట్టి నెల వయసు కూడా లేదు కానీ బాబు కోసం ఈమె పెద్ద ఎత్తున బంగారు నగలను కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈమె బాబు కోసం ఏమేమి కొన్నారో కూడా తెలియజేశారు. నెలరోజులు వయసున్న బాబు కోసం దిష్టి తగలకుండా 4 గ్రాముల దిష్టి పూసల దండ (జత), 8 గ్రాముల కడెం (బేబీ బ్యాంగిల్స్ – జత), 1 గ్రాము ఉంగరం, ఒక చైన్, 14 గ్రాముల బ్రేస్‌లెట్ తీసుకున్నారు.

Serial Actress: భారీగా బంగారం కొన్న వైష్ణవి….
ఇలా బాబు కోసం మాత్రమే కాకుండా తనకోసం కూడా లక్ష్మి హారం అందుకు మ్యాచింగ్ కమ్మలు గాజులను కూడా కొనుగోలు చేశారు. ఈ విధంగా వైష్ణవి పెద్ద ఎత్తున బంగారు కొనుగోలు చేసినటువంటి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో చూసిన నేటిజన్స్ ఒక్క నెల బాబు కోసం ఇంత బంగారం కొనుగోలు చేశారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

































