Serial artist Madhusudhan : ‘గోరంత దీపం’ సీరియల్ ద్వారా తెలుగులో మంచి పేరు సాధించిన నటుడు మధు సుధన్ ‘నా పేరు మీనాక్షి’ సీరియల్ తో ఫేమ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం అయితే కళ్యాణం కమణీయం సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సీరియల్స్ లో నటించేకంటే ముందు సినిమాల్లో హీరోగా ప్రయత్నించిన ఈ కన్నడ కుర్రాడు కన్నడ లో కొన్ని సినిమాలలో హీరోగా నటించి ఆపైన అక్కడ సీరియల్స్ లో చేసాడు. ఒకవైపు కన్నడ సీరియల్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో హీరోగా నటించిన మధు సుధన్ తెలుగులో మాత్రం సీరియల్స్ కి పరిమితమయ్యారు. ప్రస్తుతం సీరియల్స్ బెటర్ అంటూ వాటినే చేస్తున్నానని ఇందులో గుర్తింపు సినిమాల్లో హీరోగా కన్నా ఎక్కువగా ఉంటుందంటూ చెబుతున్నాడు మధు సుధన్.

కుటుంబమే నా ప్రపంచం…
మధు సుధన్ చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసేసుకున్నారట. తనది కర్ణాటక అయినా ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న ఆయన కుటుంబం గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. అమ్మ నాన్న ఇద్దరూ లేరని ప్రస్తుతం నా పిల్లలు నా భార్యే ప్రపంచం అంటూ చెప్పిన ఆయన తన కూతురే తనకు డ్రెస్ సెలక్షన్, ఎలాంటి డిజైన్స్ వెయ్యాలి వంటి విషయాలు చెబుతుందని చెప్పారు.

తాను ఈ జనరేషన్ అమ్మాయి కావడం వల్ల తన సెలక్షన్ బాగుంటుందని చెప్పారు. ఒక కూతురు కొడుకు ఉండగా కూతురు ఇంటర్ చదువుతోందని చెప్పి షాక్ ఇచ్చారు మధు సుధన్. భార్య పిల్లలు పేర్లు పచ్చ బొట్టు వేయించుకున్న ఆయన వాళ్ళే నా ప్రపంచం అంటూ తెలిపారు.



























