Serial artist Yashmi Gowda : సీరియల్ లో రోజుకో చీర కట్టాలి.. అన్ని చీరలు ఎక్కడి నుండి…: సీరియల్ నటి యష్మీ గౌడ

0
927

Serial artist Yashmi Gowda : ఈటీవీలో గతంలో వచ్చిన ‘స్వాతి చినుకులు’ సీరియల్ తో బుల్లితెర మీద అడుగుపెట్టిన కన్నడ బ్యూటీ యష్మీ గౌడ. ఆ సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు ఆదరణ అందుకున్న ఈ అమ్మాయి ఆ తరువాత జీ తెలుగులో ప్రసారమయిన ‘నాగ భైరవి’ సీరియల్ లో హీరోయిన్ గా నటించింది. ఆ సీరియల్ హిట్ అవ్వడంతో మంచి గుర్తింపు అందుకుని తెలుగు ఇండస్ట్రీలో మంచి అవకాశాలు అందుకుంటోంది ఈ కన్నడ కస్తూరి.

సీరియల్ లో కట్టే చీరలు ఎక్కడివంటే…

రోజూ సీరియల్ చూసే మహిళా ప్రేక్షకులు ముఖ్యంగా ఫాలో అయ్యేది ఆ సీరియల్ లో లేడీ క్యారెక్టర్స్ కట్టే చీరలు అలాగే వాళ్ళు పెట్టుకున్న నగలు. ప్రేక్షకులు వాటిని గమనిస్తారనే ఆర్టిస్టులు కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. క్యారెక్టర్ కి తగ్గట్టు బట్టలు అలాగే, నగలు ఉండేలా ప్లాన్ చేసుకుంటారు. అయితే సీరియల్ లో కట్టిన చీరలు కట్టకుండా మేనేజ్ చేస్తుంటారు. నిజానికి వాళ్లకు చీరలు, నగలు సీరియల్ ప్రొడక్షన్ టీం ఇస్తుందా లేకపోతే ఆర్టిస్టులే సొంతంగా తెచ్చుకుంటారా అనే విషయాలను యష్మీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

నిజానికి సీరియల్ లో క్యారెక్టర్ కి తగ్గట్టు బట్టలు ఆర్టిస్టులే తెచ్చుకుంటారు. అలా యష్మీ కూడా తన చీరలను తానే తెచ్చుకుంటుదట. ఇక వాటి గురించి పెద్దగా అవగాహన లేదని బ్లౌస్ డిజైన్స్ వీటి మీద కూడా పెద్దగా ఐడియా లేదంటూ చెబుతున్న యష్మీ తన తల్లి చీరలనే ఎక్కువగా కడతానంటూ చెబుతోంది. వాటికే బ్లౌస్ సెట్ చేసుకుని అవే కడుతుంటానని వివరించారు. ప్రస్తుతం మా టీవిలో ప్రసారమవుతున్న ‘కృష్ణ ముకుంద మురారి’ లో లీడ్ రోల్ చేస్తున్నారు యష్మీ గౌడ.