ఎన్నో కుటుంబ కదా చిత్రాలతో మన అందరికి సుపరిచితురాలైన సీనియర్ నటి సితార. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా మనల్ని అలరిస్తోంది. 1986 లో ఆమె సినీ కెరియర్ ప్రారంభమైంది. ఆ తరువాత తెలుగు, తమిళం తో పాటుగా దాదాపు దక్షిణాది భాషలు అన్నిటిలో ఆమె నటించారు. స్వతహాగా మలయాళీ అయిన సితార మొదట్లో ఆమెను తెలుగమ్మాయి అనుకునేవారు. దానికి తోడు ఆమె నటించిన నటించిన పాత్రలు అన్ని కుటుంబ కథా చిత్రాలే కావడంతో ప్రతి ఒక్కరు ఆమెను తమ కుటుంబ సభ్యురాలిగా భావించారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి సితార.

అయితే అంత సీనియర్ నటి, దక్షిణాది ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. 50 ప్లస్ వయస్సు దాటినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై అనేక రూమర్స్ వచ్చినా ఆమె పట్టించుకోలేదు. అయితే తాజగా వయస్సు పెరుగుతున్న సమయంలో తోడూ ప్రతి ఒక్కరికీ అవసరం అనే విషయం గుర్తించిందో ఏమో.. తన మనసుకు నచ్చిన ఒక వ్యపారవేత్తతో ప్రేమలో పడిందని తెలుస్తోంది. అతడు గతంలో సితార నటించిన కొన్ని సినిమాలకు ఫైనాన్స్ చేసాడు. ఆ సమయంలోని పరిచయం కాస్త ప్రేమగా మారిందేమో.. అయితే ఆ వ్యక్తికీ ఇప్పటికే పెళ్లి అయిందట. అయినా కూడా ఈ సీనియర్ నటితో సన్నిహిత బంధాన్ని నడుపుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో ఈ విషయం గురించే గుసగుసలు వినిపిస్తున్నాయి.
































