కోవిడ్ నియంత్రణలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరో సర్వే నిర్వహించాలని భావిస్తోంది. ఈ సర్వే కోసం వైద్య ఆరోగ్యశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాక్సినేషన్ తర్వాత యాంటీబాడీలు వృద్ధి చెందాయా ? మూడో వేవ్ వస్తే ఎలా.. హైరిస్క్ జోన్‌లో ఉన్న వారి శాతం ఎంత? లాంటి వివరాలతో ఈ సర్వే నిర్వహించనున్నారు. మూడు జిల్లాలు మినహాంచి 30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే జాతీయ పోషకాహార సంస్థ కామారెడ్డి, జనగాం, నల్గొండ జిల్లాల్లో సీరో సర్వే నిర్యహించింది.

30 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీఆర్కే భవన్‌లో వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. యాంటీబాడీస్ వృద్ధి చెందిన వారి గుర్తించి వారిపై ప్రత్యేకంగా శ్రద్ద పెట్టనున్నారు. అలాగే వ్యాక్సినేషన్‌లో వేగం పెంచేందుకు చర్యలకు అవకాశం ఉంటుంది.



























