Shahid Kapoor : పుష్ప సినిమాతో ఏవిధమైన ప్రచారం లేకుండానే పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు బన్నీ. పుష్ప సినిమా కేవలం నార్త్ లోనే 100కోట్లకు పైగా వసూలుచేసింది.అదికూడా ఎక్కువ ప్రచారం లేకుండానే. ఇక హిందీ ప్రేక్షకులకు స్టైలిష్ స్టార్ హిందీ డబ్బింగ్ సినిమాలతో బాగానే ఫేమస్. మొన్నామధ్య కరణ్ జోహార్ బన్నీ కి శాటిలైట్ స్టార్ అంటూ కొత్త బిరుదును కూడా ఇచ్చాడు. అంతలా స్టైలిష్ స్టార్ సినిమాలు హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టెలివిజన్ టీఆర్పి ల్లో దుమ్ములేపాడు బన్నీ.

బన్నీ తో నటించాలని ఉందంటున్న షాహిద్….
బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీపై చాలా ప్రేమ పెరుగుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి అర్థం అవుతుంది. వరుసగా తెలుగు సినిమాలను రీమేక్ చేస్తున్నారు షాహిద్ కపూర్. అర్జున్ రెడ్డి తో హిట్ అందుకుని ఇపుడు జెర్సీ సినిమా చేసాడు షాహిద్.తాజాగా జెర్సీ సినిమా ప్రచారం కార్యక్రమల్లో భాగంగా గౌతమ్ తిన్ననూరి తో పాటు ఇంటర్వ్యూ లు ఇస్తున్నారు షాహిద్. ఈ ప్రమోషన్స్ లోనే తన మనసులోని మాటను బయటపెట్టాడు.
తెలుగు హీరోలలో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నా రనే ప్రశ్నకు షాహిద్ అల్లు అర్జున్ పేరు చెప్పారు. ఇక పుష్ప సినిమాలోని శ్రీవల్లి స్టెప్స్ కూడా వేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు ఇక బన్నీ, షాహిద్ తో పాన్ ఇండియా మూవీ వస్తే చాలా బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.



























