Shahrukh Khan: ఇన్కమ్ టాక్స్ కేసులో చిక్కుకున్న నటుడు షారుఖ్ ఖాన్ కు భారీ ఊరట లభించింది. ఇన్కమ్ ట్యాక్స్ అప్పీలేట్ ట్రిబ్యునల్ ఈ మేరకు తాజాగా షారూఖ్ పై పెట్టిన కేసు న్యాయ బద్దం కాదని తేల్చి చెప్పింది, అంతేకాదు ఈ కేసు విషయంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా చురకలు అంటించారు. షారుఖ్ ఖాన్ రా- వణ్ అనే సినిమాలో నటించారు.

ఈ సినిమా దాదాపు 70% షూటింగ్ పనులు యూకే లో జరుపుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి ట్యాక్స్ వివరాలు యూకే దేశ టర్మ్స్ అండ్ కండీషన్స్ పై ఆధారపడి ఉంటాయి.2011-2012 సంవత్సరానికిగానూ రూ. 83.42 కోట్లు పన్ను చెల్లిస్తున్నట్లు, అలాగే యూకేలో చెల్లించే ట్యాక్స్ విషయంలో విదేశీ క్రెడిట్స్ కోసం షారుఖ్ ఖాన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఇక ఇన్కమ్ టాక్స్ అధికారులు ఈ దరఖాస్తులను పూర్తిగా తిరస్కరించారు.
ఇక నాలుగు సంవత్సరాల తర్వాత. రూ.84.17 కోట్లు టాక్స్ మొత్తం షారుఖ్ ఖాన్ కట్టాలని వెల్లడించారు. ఇలా షారుక్ ఖాన్ ఈ పన్ను మొత్తం చెల్లించాలని చెప్పడంతో వెంటనే ఆయన ITAT ను సంప్రదించారు అయితే ఈ కేసును పరిశీలించిన ఇన్కమ్ టాక్స్ అధికారులు షారుక్ ఖాన్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. అలాగే నాలుగు సంవత్సరాల తర్వాత కేసును తిరిగి కరెక్షన్ చేయటం సరికాదు అంటూ అధికారులకు చురకలు అంటించారు. ఈ విధంగా ఇన్కమ్ టాక్స్ విషయంలో షారుఖ్ ఖాన్ కు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ విషయంలో ఆయనకు ఒక బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి.
Latest Videos :



























