Shahrukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి షారుక్ ఖాన్ ముంబైలోనీ బాంద్రాలో నివసిస్తున్న విషయం మనకు తెలిసిందే ఇక ఈయన నివసిస్తున్న ఈ ఇంటికి మన్నత్ అనే పేరు పెట్టుకున్నారు.

షారుక్ ఖాన్ 1998లో ఎస్ బాస్ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఆరు అంతస్తుల గల ఈ భవనాన్ని చూసి మంత్రముగ్ధుడయ్యారట. ఎలాగైనా ఈ ఇంటికి యజమాని కావాలన్న ఉద్దేశంతో ఈయన ఈ ఇంటిని 2001వ సంవత్సరంలో కొనుగోలు చేశారని తెలుస్తోంది. అప్పట్లో షారుక్ ఖాన్ ఈ ఇంటి కోసం 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.
ఇలా ఈ ఇంటిని కొనుగోలు చేసిన తర్వాత ఈ ఇంటికి జిన్నత్ అనే పేరు పెట్టారు. అనంతరం గౌరీ ఖాన్ ఈ ఇంటిని మరింత అందంగా తన ఇంటీరియర్ డిజైన్ తో తీర్చిదిద్దడమే కాకుండా ఈ ఇంటికి మన్నత్ అని నామకరణం కూడా చేశారు. 1920లో నిర్మించిన గ్రేడ్ 3 హెరిటేజ్ విల్లా. ఆధునిక ఇటాలియన్ ఆర్కిటెక్ట్‌లతో దీన్ని నిర్మించడం విశేషం. ఈ 6-అంతస్తుల బంగ్లాలో జిమ్, స్విమ్మింగ్ పూల్ మరియు ప్రైవేట్ సినిమా థియేటర్ కూడా ఉన్నాయి.

Shahrukh Khan: వందల కోట్ల విలువ చేస్తున్న షారుక్ మన్నత్..
ఇలా అన్ని సౌకర్యాలతో ఉన్నటువంటి ఈ ఇంటిని షారుక్ అప్పట్లో 13 కోట్లకు కొనుగోలు చేయగా ఇప్పుడు మాత్రం ఈ ఇంటి ఖరీదు దాదాపు 200 కోట్ల వరకు విలువ చేస్తుందని సమాచారం.ఇకపోతే ఈ ఇంటిని షారుక్ కంటే ముందుగా కొనే అవకాశం మరొక నటుడు సల్మాన్ ఖాన్ కి వచ్చినప్పటికీ ఈయన మాత్రం కొనడానికి ఆసక్తి చూపకపోవడంతో ఇంటిని 13 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తుంది.



























