షకీలా అంటే తెలియని సినీ ప్రేక్షకులు ఉండరు. ఈ మలయాళ సెన్సేషన్. ఈమధ్యలో కాస్త సైలెంట్ అయింది కానీ.. ఒకప్పుడు ఈమె మలయాళంలో టాప్ స్టార్.. అసలు షకీలా సినిమా వస్తుంది అంటే చాలు స్టార్ హీరోలు సైతం… బెంబేలెత్తేవారు. కొంత మంది వారి సినిమా రిలీజ్ డేట్ ను మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో ఆమె సినిమాలు ఉన్న క్రేజ్ అలాంటిది మరి.. ఆ తరువాత కొద్దిరోజులకు ఈ భామ అదోరకం మలయాళ సినిమాలు మానేసి తెలుగు తెరపై పద్ధతైన సినిమాలు చేసుకుంటూ పద్దతిగా ఉండేది. తెలుగులో కూడా మొదట్లో ఆమెకు అవకాశాలు బాగానే వచ్చినా. తరువాత తరువాత మాత్రం ఆమె సినిమాలలో దాదాపు కనుమరుగైపోయింది. తాజాగా “షకీలా రాసిన మొదటి కుటుంబ కధా చిత్రం” అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు వస్తుంది ఈ మలయాళీ భామ. అయితే రావడం రావడం సెన్సేషన్ క్రేయేట్ చేసింది.

“షకీలా రాసిన మొదటి కుటుంబ కధా చిత్రం” చితం ప్రమోషన్స్ లో భాగంగా షకీలా ఇచ్చిన ఒక ఇంటర్వూలో దక్షిణాది హీరోల గురించి మాట్లాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు తనకు తమ్ముడు లాంటి వాడని, మహేష్ బాబుతో నాని, నిజం రెండు సినిమాలలో నటించానని గుర్తు చేసింది. అప్పటి నుంచి మహేష్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమాట. తనని తమ్ముడిలా భావిస్తానని అన్నారు. మరో హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ చాలా మంచి డాన్సర్ అయితే అల్లు అర్జున్ ఎవరో మాత్రం నాకు తెలియదు అని షాకింగ్ కామెంట్స్ చేసింది షకీలా. మోహన్ లాల్ దేవుడు లాంటి మనిషి. చాలా బాగా మాట్లాడతారు. ఆయన చాలా మంచివాడని చెప్పింది షకీలా. మమ్ముట్టి గురించి మాట్లాడుతూ అయన తనకు నచ్చడని, ఒకప్పుడు మీరు ముస్లిం ఆ అని అడిగినందుకు తన మీద చిరాకు పడ్డాడని చెప్పొకొచ్చింది ఈ మలయాలి భామ.

ఇదంతా ఓకే గాని తనకి అల్లు అర్జున్ ఎవరో తెలియదు అనడం మాత్రం ఫిలింనగర్ వర్గాలలో పెద్ద చర్చేజరుగుతుంది. అల్లు అర్జున్ కి మలయాళీ ఫాన్స్ చాలా మందే ఉన్నారు. కొంత మంది మలయాళీలు ఆయనను దేవుడిలా చూస్తారు. అక్కడ బన్నీకి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. ఓక మలయాలి అయిఉండి అస్సలు అల్లు అర్జున్ ఎవరో తెలియదని చెప్పడం పై అల్లు అర్జున్ ఫాన్స్ సోషల్ మీడియాలో షకీలా మీద మండిపడుతున్నారు. కొందరు అయితే సినిమా ప్రమోషన్ కోసమే షకీలా ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తుందని కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here