ఏ ఆడపిల్లకు రాకూడని కష్టాలు షాలిని అనుభవించింది… ఆఖరికి తండ్రిపైననే కేసు పెట్టబోయింది !

0
197

షాలిని పాండే… టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్. అప్పటి వరకూ ఈ లిప్ లాక్ అంటే ఏదో అన్నట్టు గా చేసే హీరోయిన్లను టాలీవుడ్ లో చూశాం. అయితే అర్జున్ రెడ్డి సినిమా తో షాలిని పాండే టాలీవుడ్ లో నటించిందో ఇక అప్పటి నుంచి లిప్ లాక్ అంటే ఇలా ఉండాలి అన్నట్లు మార్చేసింది షాలిని. ఇక ఈమె విషయానికి వస్తే… అర్జున్ రెడ్డి ముందు అర్జున్ రెడ్డి తర్వాత అని ఈజీగా చెప్పవచ్చు. అంతలా షాలిని జీవితాన్ని మార్చేసింది అర్జున్ రెడ్డి సినిమా. ఇకపోతే షాలిని పాండే సెప్టెంబర్ 23, 1993 న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్ పూర్ లో జన్మించింది.

షాలిని పాండే తండ్రి ఓ గవర్నమెంట్ ఉద్యోగి. ఇక షాలిని పాండే తన చదువు విషయానికి వస్తే… జబల్ పూర్ నగరంలోని జబల్ పూర్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పట్టా సాధించింది. ఇక ఈవిడ ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే సినిమాలపై ఎక్కువ ఆసక్తి చూపించడంతో తన చదువు సమయంలోనే అనేక నాటకాలలో నటించింది. చదువుకొంటున్న సమయంలో చదువు మానేసి సినిమా రంగం లోకి వెళ్లాలని అనుకున్న వారి ఇంటిలో వారు అందుకు ఒప్పుకోలేదు. దీంతో తన ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇక ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్ శిక్షణ తీసుకుంది. అందులో నటన పరంగా తన ప్రతిభ చూపడంతో నటించడానికి వారి కుటుంబ సభ్యులు ఓకే తెలిపారు.

అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు వారి ఇంట్లో వారు ఏమైందో తెలియదు కానీ, మొత్తానికి సినిమాల్లో నటించవద్దని తెలిపారు. అలా చెప్పినందుకు తన తండ్రితో విభేదించి ఇంట్లోనుంచి బయటకి వెళ్ళిపోయింది. ఓసారి ముంబై లో తన స్నేహితురాలిని కలిసి వస్తానని వెళ్ళిన ఆవిడ తన ఇంటికి మరోసారి వెళ్లలేదు. తను నటించడానికి మీరు అనుమతిస్తే నేను ఇంటికి వస్తా అని చెప్పినా కూడా వారి తల్లిదండ్రులు ఆమెకు ప్రోత్సాహం ఇవ్వలేదు. అంతేకాక షాలిని ఇంటికి రావాలని ఇబ్బందికి గురి చేశారు. అయితే తాను మేజర్ అని, నన్ను బలవంతంగా ఒప్పిస్తే గనుక నేను కేసు పెడతానని బెదిరించడంతో తన తండ్రి ఇక ఇంటికి రావద్దని తేల్చి చెప్పాడు.

ఇక ఆ తర్వాత షాలిని పాండే అనేక ప్రయత్నాలు చేశారు. డబ్బులు లేక అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. ఒక సమయంలో ఉండడానికి ఇల్లు లేకపోవడం, తినడానికి తిండి లేకుండా ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయట. ఇక అంత కష్టం లో కూడా ఆవిడ సినిమాల పై మక్కువతో అనేక ప్రయత్నాలు చేసే ఈ సమయంలో ఆవిడ అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే సమయానికి రెండు నెలల ముందే ఆమె చేతిలో ఉన్న డబ్బులు పూర్తిగా అయిపోయాయి. దీంతో ఆమెకు ఏమి చేయాలో అర్థం కాక తనకు తెలిసిన ఇద్దరు అబ్బాయిల రూమ్ లో వారితో పాటు కలిసి జీవనం కొనసాగించింది. ఇలా అన్ని బాధలు భరించిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమా తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

అర్జున్ రెడ్డి సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయిన విజయ్ దేవరకొండ, మరోవైపు హీరోయిన్ గా నటించిన షాలిని పాండే కూడా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. అయితే ఆ తర్వాత మాత్రం అనేక కమర్షియల్ సినిమాలో తన దగ్గరికి వచ్చిన తాను కేవలం గెస్ట్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. ఈ సినిమాలో తన క్యారెక్టర్ రోల్ ఏవిధంగా ఉండాలో తానే దర్శకులకు చెప్పే లా ఉండడంతో దర్శకుడు ఆమెను కాస్త దూరం పెడుతున్నారు అని టాలీవుడ్ టాక్. అయితే ఇటీవల తాను ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… తనకు సినిమా ఆఫర్లు రాకముందు ఎంతగానో సహాయం చేసిన స్నేహితులను ఎప్పటికీ మర్చిపోను అని తెలియజేసింది. నా అని లేని ఈ సమయంలో వారు నన్ను ఎంతగానో ఆదుకున్నారు కన్నీటిపర్యంతమై తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here