సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున పోరాటాలు విప్పుతున్నారు హీరోయిన్ లు.. ఇప్పటితరం నటీమణులు కాదు పాత తరం నటీమణులు సైతం గొంతెత్తి తమపై జరిగిన లైంగీక దాడులను చెప్తున్నారు. గతంలో లేని ఇప్పుడు వచ్చిందంటే వారు ఎంతటి బాధను అనుభవించారో అర్థం చేసుకోవచ్చు. గతంలో సొసైటీ గురించి, పరువు, మర్యాదల గురించి ఆలోచించినా ఇప్పుడు వాటిని పట్టించుకోకుండా తమకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నారు.. రాబోయే తరానికి లైన్ క్లియర్ చేస్తున్న వీరి చర్యలు హర్షణీయం..

దర్శక నిర్మాతల అఘాయిత్యాలను ధైర్యంగా చెప్పడం ఒకరకంగా మంచిదే అయినప్పటికీ పెద్ద పెద్ద హోదాల ఉన్న నటులు, నిర్మాతలు, దర్శకులు కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ లో భాగం అయినందుకు ఎలా రియాక్ట్ అవ్వాలో ప్రేక్షకులకు తెలీట్లేదు.. బయటకి చెప్పలేని విధంగా తమపై లైంగీక దాడి చేశారని నటీమణులు చెప్తుంటే వాళ్ళని ఏం చేస్తే సినిమా ఇండస్ట్రీ పై ఉన్న మరక చెరిగిపోతుందో అర్థం కావట్లేదు. ఇకపోతే ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది కోలీవుడ్ నటి..తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన షాలు షమ్ము ఇప్పుడిప్పుడే వర్థమాన నటిగా గుర్తింపు పొందుతున్నారు.
తమిళంలో శివ కార్తీకేయన్‌తో కలిసి వరుథపడథ వలిబార్ సంగమ్, మిస్టర్ లోకల్ కలిసి నటించింది. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతాయి.టాలీవుడ్‌కు చెందిన బిగ్‌హీరోతో పడుకోవడానికి కంప్రమైజ్ కాకపోతే.. ఆమె టాలెంట్‌ను రిజెక్ట్ చేశారు. ఇలాంటి వాటిని మార్చాలిన అవసరం ఉంది అంటూ #weneedachange #stopharrassment #wenevercompromise లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌తో పోస్టు పెట్టారు.వర్థమాన నటి షాలు షమ్ము మరో పోస్టులో.. ఇటీవల ఓ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇస్తానని నాతో మాట్లాడారు. అయితే విజయ్ దేవరకొండ పక్కన అవకాశం ఇస్తాను. కానీ అతడితో పడక గదిని పంచుకొంటావా అంటూ డిమాండ్ చేశాడు. అయితే నేను నిరాకరించడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు అని పేర్కొన్నారు.































