క్రికెటర్ మహ్మద్ షమీ అయన భార్య హాసిన్ జహాన్ మధ్య కొన్ని మనస్పర్థల కారణంగా ప్రస్తుతం వీరిద్దరూ విడివిడిగా నివసిస్తున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది. అయితే ఈ నేపధ్యంలో హాసిన్ తన భర్త షమీ 2018లో తనను వేదిస్తున్నాడంటూ పిర్యాదు కూడా చేసింది. అప్పట్లో ఇదో పెద్ద దుమారమే రేపింది. అయితే ఆ తర్వాత కూడా చాన్స్ దొరికినప్పుడల్లా భర్త షమీపై విమర్శలు చెస్తూనే ఉంటుంది. అతనిని కించపరిచేలా వ్యాఖ్యలు చెస్తూ, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చేస్తోంది. అయితే, షమీ మాత్రం ఎప్పుడూ ఈ విషయాలపై నోరు మెదపలేదు.

కాగా, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షమీతో కలిసి అర్ధనగ్నంగా దిగిన ఫొటోను పోస్ట్ చేసి, అతడిపై మరోసారి ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది. ‘నీ దగ్గర ఎమీలేనప్పుడు నన్ను ఆరాధించావు. ఇప్పుడు నీకు అన్నీ ఉన్నాయి. కానీ నేనే మలినం అయిపోయాను. నిజం, అబద్ధాలు ఎప్పటికీ దాగవు’ అంటూ సంచాలన పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టుపై షమీ అభిమానుల వాదన మరోలా ఉంది. ఆమె ఇప్షపటికే షమీ కెరీర్‌ను దెబ్బతీసింది, ఇప్పుడు మరో కొత్త నాటకం ఆడుతోందంటూ మండిపడుతున్నారు.




























