Shankar: సినిమాలలోకి వచ్చిన కూతురికి అలాంటి కండిషన్ పెట్టిన డైరెక్టర్ శంకర్… ఆ కండిషన్ ఏంటో తెలుసా?

0
33

Shankar:డైరెక్టర్ శంకర్ పరిచయం అవసరం లేని పేరు దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శంకర్ తన కుమార్తెను హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా అదితి శంకర్ ఇప్పటివరకు రెండు సినిమాలలో నటించారు. ప్రస్తుతం ఈమె మరో మూడు సినిమాలకు కమిట్ అయ్యారని తెలుస్తుంది.

ఇలా డైరెక్టర్ శంకర్ కుమార్తెగా అందరికీ ఎంతో సుపరిచితమైనటువంటి అతిథి శంకర్ తన టాలెంట్ తో నటించిన మొదటి రెండు సినిమాలు సూపర్ హిట్ అందుకుని ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ అయ్యారు. ఇలా కెరియర్ పరంగా అదితి శంకర్ ఎంతో బిజీగా ఉన్నారు
అయితే తాజాగా ఈమె కెరియర్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదితి శంకర్ వైద్యవృత్తిని అభ్యసించారు. ఈమెను డాక్టర్ గా చూడాలన్నదే తన తల్లిదండ్రుల కల అయితే సినిమాలపై ఎంతో ఆసక్తి ఉన్నటువంటి అతిథి శంకర్ ఇండస్ట్రీలోకి రావాలని తన తండ్రిని అడగడంతో చాలా బలవంతం మీద కండిషన్ల మీద అదితి శంకర్ ఇండస్ట్రీలోకి రావడానికి శంకర్ ఒప్పుకున్నారట.

Shankar: పెళ్లి చేసుకోవాల్సిందేనా…


తాను హీరోయిన్గా ఇండస్ట్రీలోకి రావాలి అంటే కొన్ని కండిషన్లకు తప్పనిసరిగా ఒప్పుకోవాలని శంకర్ కండిషన్స్ పెట్టారట మొదటిది తాను రెండేళ్ల వరకు మాత్రమే ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలని అప్పటివరకు ఎన్ని సినిమాలు చేసుకున్న తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు. అయితే రెండు సంవత్సరాల తర్వాత తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిందేనని శంకర్ తన కుమార్తెకు కండిషన్ పెట్టారట ఈ కండిషన్లకు ఒప్పుకున్నటువంటి అదితి వీలైనంతవరకు ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ ఎక్కువ సినిమాలు చేయటానికి ఆరాటపడుతున్నట్లు తెలుస్తుంది.