Sharath Kumar : ‘సమాజంలో స్త్రీ’ అనే సినిమాతో తెలుగులో పరిచయమైన శరత్ కుమార్ తమిళం లో మాత్రం అప్పటికే సినిమాలను చేశారు. ఇక దక్షిణ భారత నటుల సంఘం కి అధ్యక్షుడు గా కూడా పనిచేశారు. ఇక పొలిటీషియన్ గా, జర్నలిస్ట్ గా విలన్, హీరో బాడీ బిల్డర్ ఇలా అన్ని పాత్రలను శరత్ నిర్వర్తించారు. అన్ని భాషలలో కలిపి సుమారు 130 సినిమాలకు పైగా నటించిన శరత్ కుమార్ గారి కూతురు వరలక్ష్మి కూడా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అటు హీరోయిన్ గా ఇప్పుడు విలన్ గా రానిస్తోంది. శరత్ కుమార్ గారి మొదటి భార్య ఛాయా కూతురు వరలక్ష్మి. ఇక ఆయన రెండో భార్య అలనాటి హీరోయిన్ రాధిక.

విజయశాంతి కసురుకుంది…
‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో నటించిన శరత్ కుమార్ గారు ఆ సినిమా ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇక ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మాట్లాడుతూ ఆయన మొదటి తెలుగు సినిమా సమాజంలో స్త్రీ లో విజయశాంతి పక్కన నటించారు. అయితే మొదటి సినిమా కావడం వల్ల నటించడం ఇంకా బాగా రాక ఇబ్బందిపడ్డాను.

ఒక సన్నివేశం సమయంలో ఎక్కువ టేకులు తీసుకోవడం వల్ల విజయ శాంతి గారు విసుక్కున్నారు. అయితే మళ్ళీ నేను సినిమాల్లో మంచి అవకాశాలతో స్టార్ గా ఎదిగినప్పుడు మళ్ళీ విజయశాంతి గారితో కలిసి నటించినపుడు మొదటి సినిమా సమయంలో జరిగిన సంఘటన చెబితే విజయశాంతి సారీ చెప్పారు అంటూ అప్పటి విషయాన్ని షేర్ చేసుకున్నారు.



























