Sharwanand : తెలుగులో హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా కథ బాగా నచ్చితే సినిమాలు చేసే హీరో శర్వానంద్. ఈమధ్య కాలంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అంటూ వచ్చి మంచి హిట్ అందుకున్న శర్వానంద్ త్వరలో ‘ఒకే జీవితం’ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో శర్వానంద్ కి జంటగా రీతూ వర్మ నటించింది. ఇక వెన్నెల కిషోర్ కూడా కీలకం పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ముఖ్య పాత్రలో అమల నటించారు. ఇక సినిమా విడుదలకు దగ్గర పడుతుండడం తో ప్రమోషన్స్ ను షురూ చేసారు చిత్ర యూనిట్.

ఎన్టీఆర్ సీక్రెట్ చెప్పిన శర్వానంద్…
శర్వా, రామ్ చరణ్, రానా వీళ్లంతా స్నేహితులు కలిసి చదువుకున్నారని అందరికీ తెలుసు. అయితే ఎన్టీఆర్ కూడా శర్వా తో కలిసి చదువుకున్నాడని ఎవరికీ తెలియదు. ఒకే జీవితం ప్రమోషన్స్ లో భాగంగా శర్వానంద్, వెన్నెల కిషోర్ సినిమా గురించిన ముచ్చట్లతో ఇంటర్వ్యూ సాగగా.. మధ్యలో వ్యక్తిగత విషయాలను ప్రస్తావించారు వెన్నెల కిషోర్, శర్వా. ఇక అలా చెబుతూ శర్వా తాను చదువుకునే రోజుల్లో విషయాలను చెబుతూ ఎన్టీఆర్ తాను ఒక ఏడాది కలిసి చదువుకున్నామని చెప్పారు.

అయితే రెండో సంవత్సరం ఎన్టీఆర్ కాలేజీ వదిలేసి వెళ్లిపోయాడని ఆ తరువాత ఎక్కడ చదువుకున్నాడో తనకు తెలియదని చెప్పాడు. అప్పుడు కాలేజ్ వదిలినపుడు కూడా ఏదో సినిమా షూటింగ్ కోసం వెళ్లిపోయాడని శర్వా చెప్పాడు. ఇక ఇంతవరకు ఎక్కడా ఈ విషయాన్ని ప్రస్థావించలేదంటూ సీక్రెట్ చెప్పేసాడు శర్వానంద్. అలా ఇంటర్మీడియట్ శర్వా ఎన్టీఆర్ కలిసి చదివారనే విషయాన్ని చెప్పి ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ ను వాడేసుకున్నాడు శర్వానంద్.



























