గత 16 ఏళ్లుగా టాలీవుడ్ లో సినీ కెరీర్ ని కొనసాగిస్తూ వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరో శర్వానంద్ వయస్సు ప్రస్తుతం 36 సంవత్సరాలు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సలహా మేరకు శర్వానంద్ పెళ్లికి రెడీ అయ్యారని తెలుస్తోంది. అయితే ఇక్కడొక ఆసక్తికర విషయమేమిటంటే.. మన శర్వానంద్ చేసుకోబోయేది తన చిన్ననాటి స్నేహితురాలినే అంట. గత కొన్నేళ్లుగా ఆమెతో ప్రేమలో ఉన్న శర్వానంద్.. తన ప్రేమ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దల వద్దకు తీసుకెళ్లి అందరి అంగీకారం పొందారట.

ఇలా మొత్తం లైన్ క్లియర్ చేసుకున్న ఆయన ఇక పెళ్లికి ముహూర్తం వెతికే పనిలో ఉండగా ఓ దురదృష్టకరమైన వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. కొండపోత వర్షాలతో ప్రస్తుతం కృష్ణా నది పొంగి ప్రవహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ దగ్గర కృష్ణా నది ఉధృతి మరీ ఎక్కువగా ఉంది. కృష్ణా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉండే సామాన్య ప్రజలను ఇప్పటికే ప్రభుత్వం అప్రమత్తం చేసి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే కృష్ణానది ఒడ్డున ఉన్న మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంటికి కూడా వరద ముప్పు ఉండటంతో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా.. ప్రముఖ టాలీవుడ్ హీరో శర్వానంద్ తాత డాక్టర్ మైనేని హరిప్రసాద్ ఇల్లు కూడా కృష్ణా నది వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. అవనిగడ్డ సమీపంలోని ఎండ్లలంక గ్రామంలో కృష్ణా నది ఒడ్డున ఈ ఇల్లు ఉంది.
హీరో శర్వానంద్ తాత మాజీ అణు శాస్త్రవేత్త అనే విషయం చాలా మందికి తెలియదు. సంఘ సంస్కర్తగా స్థానికంగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. శర్వానంద్ తాత ఇల్లు వరదలో కొట్టుకుపోవడంతో ఈ సంఘటనని చూడటానికి అక్కడకొచ్చిన స్థానికులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు కూడా శర్వానంద్ ముత్తాత ఇల్లు పూర్తిగా కృష్ణానదిలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.! కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర ఉన్న ఈ ఇంటికి శర్వానంద్ కూడా అప్పుడప్పుడు వస్తుండేవారు. కొన్నిరోజులు ఇదే ఇంట్లో గడిపి వెళ్లేవారు. తాజాగా వచ్చిన కృష్ణా వరదలకు ఆ ఇల్లు కొట్టుకుపోయింది.



























