Sharwanand: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు పొందిన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదట ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటించిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకడైన శర్వానంద్ ఆ బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పి ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే శర్వానంద్ ఎంగేజ్మెంట్ జరిగి ఇప్పటికే మూడు నెలలు గడిచినా కూడా పెళ్లి గురించి ప్రస్తావించలేదు. దీంతో శర్వానంద్ పెళ్లి గురించి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు పెళ్లి పీటల వరకు వెళ్లిన కూడా పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న సందర్భంలో ఉన్నాయి.
ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు అలాగే శర్వానంద్ కూడా ఎంగేజ్మెంట్ తర్వాత తన పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం శర్వానంద్ పెళ్లికి మరి కొంత టైం పడుతుందని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం శర్వానంద్ ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని అందువల్ల పెళ్లిని కొంతకాలం వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

Sharwanand: అనారోగ్య సమస్యలే కారణమా…
ప్రస్తుతం శర్వానంద్ అనారోగ్యం వల్ల శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫిక్స్ చేసిన సినిమాకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. శర్వానంద్ అనారోగ్యం నుండి పూర్తిగా కోలుకున్న తర్వాత సినిమా పూర్తి చేసి ఆ తర్వాత పెళ్లి విషయం ఆలోచించే పరిస్థితిలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం. ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ శర్వానంద్ పెళ్లి వార్తలు మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.





























