Shavukaru Janaki : అలనాటి హీరోయిన్లలో గ్లామర్ కంటే అభినయం తో అందరిని మెప్పించి తనకు పేరొచ్చిన సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న సీనియర్ నటి శావుకారు జానకి. ఆమెకు పద్మశ్రీ అవార్డు వచ్చిన తరువాత ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె జీవితంలోని తెలియని చాలా విషయాలు పంచుకున్నారు. వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకోని శావుకారు జానకి ఈ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. తన వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకులను చెప్పారు.

ఆస్తులు కోల్పోయి నడి రోడ్డున పడ్డాను..
సినిమాల గురించి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడిన జానకి తెలుగులో కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేయడానికి కారణాలు చెప్పారు. తమిళంలో పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వచ్చాయని, తెలుగులో గ్లామర్ పాత్రలు ఎక్కువ ఉండేవని వాటికి నేను సరిపోనని నేను చేయలేదని చెప్పారు . అంతే కానీ తెలుగు పరిశ్రమ నన్ను దూరం పెట్టలేదని స్పష్టం చేసారు. నా హద్దులు నాకు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తన భర్త వల్ల ఆస్తులు కోల్పోయానని చెప్పింది. తాను సంపాదించిన ఆస్తులన్నీ వ్యసనాలకు బానిసైనా తన భర్త కరగబెట్టడంతో వేరే దారి లేక విడాకులు తీసుకున్నానని పిల్లలు భవిష్యత్ కోసం నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని జీవితంలో వ్యక్తిగతంగా సంతోషంగాలేను అంటూ చెప్పారు.

ఇంతవరకు ఎపుడు వ్యక్తిగత విషయాలను చెప్పలేదని కష్టాలను తట్టుకుని మళ్ళీ నిలబడి పిల్లలను బాగా సెటిల్ చేసానని చెప్పారు. ఇక పిల్లల నుండి ఒక రూపాయి కూడా ఆశించకూడదనే భావిస్తున్నట్లు చెప్పారు. పద్మశ్రీ అవార్డు గురించి హర్షం వ్యక్తం చేసారు. ఇక జయలలిత తో ఉన్న విభేదాల గురించి 40 ఏళ్ళు మాట్లాడకుండా ఉండటం మళ్ళీ తిరిగి కలుసుకోవడం వంటి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.



































