Shekhar Master : ఎస్ఎమ్ఎస్ సినిమాతో డాన్స్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చికుని ‘జులాయి’, ‘బాద్ షా’ వంటి టాప్ హీరో సినిమాలకు కోరియోగ్రఫీ చేసే అవకాశాన్ని అందుకున్న శేఖర్ మాస్టర్ మొదట గ్రూప్ డాన్సర్, జూనియర్ ఆర్టిస్ట్ గా మొదలై నేడు టాప్ డాన్స మాస్టర్స్ లో ఒకడిగా ఉన్నాడు. కష్టపడి పైకి వచ్చిన మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో డాన్స్ మాస్టర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇక తనతో డాన్స్ నేర్చుకున్న సెలబ్రిటీల గురించి తనకు అవకాశాలు ఇచ్చిన హీరోల గురించి శేఖర్ మాస్టర్ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పంచుకున్నారు. రాకేష్ మాస్టర్ శిష్యుడిగా కొనసాగింది ఆ తరువాత సొంత డాన్స్ స్కూల్ పెట్టుకుని అలా నేడు డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు శేఖర్ మాస్టర్. అందరూ టాప్ హీరోస్ కి డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ పవన్ కళ్యాణ్ తో చేయలేకపోయాడు.

పవన్ కళ్యాణ్ తో చేయలేకపోడానికి కారణం అదే…
చిరంజీవి కి వీరాభిమాని అయిన శేఖర్ మాస్టర్ జీవితంలో మర్చి పోలేని సంఘటన అంటే చిరు గారికి డాన్స్ కంపోజ్ చేయడం అంటూ చెప్పారు. ఇక తండ్రి చనిపోయిన ఘటన నుండి బయట పడటానికి చాలా ఏళ్ళు పట్టిందని తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. డాన్సర్ గా కష్టపడుతున్న రోజుల్లో కొంచెం బాధ వచ్చినా ఆ రోజు మూడీగా ఉన్నా రాజు సుందరం గారి డాన్స్ చూసే వాన్ని అందులో రిలాక్స్ అయ్యేవాళ్ళము మా ఫ్రెండ్ అంతా. అయితే డాన్స్ మాస్టర్ అయ్యాక ఆయన చేయలేక బిజీ అయినపుడు నాకు ఆయన చేయాల్సిన సాంగ్స్ డాన్స్ కంపోజ్ చేయమని వచ్చినపుడు హ్యాపీ గా ఫీల్ అయ్యాను. ఇక అందరూ టాప్ హీరోస్ కి డాన్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ పవన్ కళ్యాణ్ కి ఇంతవరకు కోరియోగ్రఫీ చేయలేదు. రెండు సార్లు ఆ అవకాశం వచ్చినా వదులుకోవాల్సి వచ్చింది అని శేఖర్ వివరించారు.

అత్తారింటికి దారేది సినిమా సమయంలో నన్ను డాన్స్ కంపోజ్ చేయడానికి పిలిచారు అయితే అప్పుడు బాద్ షా సినిమా చేస్తుండడం వల్ల చేయలేకపోయాను. ఇక రెండో సారి బీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా అలానే జరిగింది. అదే సమయంలో పుష్ప సినిమాకు డాన్స్ కంపోజ్ చేయడం వల్ల కుదరలేదు. సాంగ్ చేయాలని సిట్టింగ్స్ కి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళాను అయితే సరిగ్గా షూటింగ్ అనుకున్నపుడు కెమెరామ్యాన్ కి జ్వరం రావడంతో షూటింగ్ వేరే రోజుకి వాయిదా పడింది. దీంతో డేట్స్ నాకు సర్దుబాటు కాలేదు దానివల్ల పవన్ కళ్యాణ్ సినిమాకు పనిచేయలేక పోయాను అంటూ చెప్పారు శేఖర్ మాస్టర్.



























