Shivani as miss Tamilnadu : హీరో రాజశేఖర్ యాంగ్రీ హీరోగా 90 దశకాల్లో మంచి హిట్స్ తో టాప్ హీరోగా ఉన్నారు. ఇక ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడ్డ అపుడపుడు మంచి సినిమాలతో వస్తు మురిపిస్తున్నారు. ఇక జీవిత రాజశేఖర్ ల కూతుర్లు శివాని, శివాత్మిక కూడా తెలుగు తెరకు హీరోయిన్లుగా పరిచయమై ఇపుడిపుడే మంచి అవకాశాలు అందుకుంటున్నారు. అక్క శివాని కంటే ముందు శివాత్మిక ముందు హీరోయిన్ గా పరిచయమైంది. ఇక అద్భుతం సినిమాతో పరిచయమైనా శివాని ఆ తరువాత డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ సినిమాలో నటించింది. అయితే ఈ రెండు సినిమాలు ఓటీటీ లో విడుదలైన సినిమాలే కావడం విశేషం.

ఇక ఇపుడిపుడే ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు మంచి అవకాశాలను అందుకుంటున్నారు. ఇక శివానికి మోడలింగ్ అంటే చాలా ఇష్టం. అందుకే ఫ్యాషన్ ట్రెండ్ తగ్గట్టు హాట్ ఫోటో షూట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటోంది. ఇక ఈ మధ్యనే మిస్ ఇండియా పోటిల్లో పాల్గొంటున్నట్లు శివాని సోషల్ మీడియాలో తెలిపింది. శివాని రాజశేఖర్ ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలలో పాల్గొని మిస్ తమిళనాడుగా ఎంపికై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఏప్రిల్ 30వ తేదీన ఈ పోటీలు జరగగా శివాని రాజశేఖర్ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడంతో ఆమె అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. అయితే శివాని రాజశేఖర్ తెలుగమ్మాయి అయినప్పటికీ మిస్ తమిళనాడుగా ఎంపిక కావడం ఏమిటని సందేహం బయలుదేరింది.
ఇక ఈ విషయంలో నెటిజన్లు శివానిని ట్రోల్ చేస్తున్నారు. తెలుగమ్మాయి అయ్యుండి తమిళనాడు నుండి పోటీలో పాల్గొనడం ఏమిటని అడుగుతున్నారు. అయితే వైరల్ అయిన నెగిటివ్ కామెంట్ల గురించి శివాని రాజశేఖర్ స్పందిస్తూ తాను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నానని తాను ఈ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని భావించానని ఆమె అన్నారు. ఫెమినా మిస్ ఇండియా పోటీల నిర్వాహకులు ధరఖాస్తులో మల్టిపుల్ ఆప్షన్లను ఇచ్చారని ఆమె వెల్లడించారు.
ఇక ఆప్షన్స్ లో ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు కూడా ఆప్షన్స్ లో ఇచ్చానంటూ చెప్పింది. చిన్నపుడు తమిళనాడులో పెరిగానని అందువల్ల ఆప్షనల్ గా తమిళనాడు ఎంచుకున్నానని చెప్పింది. ఏపీ, తెలంగాణ నుంచి నన్ను సెలెక్ట్ చేసి ఉంటే మరింత సంతోషంగా ఉండేదని తమిళనాడు కూడా ఒక ఆప్షన్ గా ఇవ్వడంతో తనను తమిళనాడు నుంచి ఎంపిక చేశారని ఆమె కామెంట్లు చేశారు. శివాని రాజశేఖర్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం శివాని తన తండ్రితో కలిసి శేఖర్ అనే సినిమాలో నటించింది. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.






























