Shivani : రాజశేఖర్ కూతుర్లు దొరసాని’ సినిమాతో ఆయన చిన్న కూతురు శివాత్మిక ఎంట్రీ ఇస్తే ‘అద్భుతం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది శివానీ రాజశేఖర్. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంటున్నారు ఈ అక్కాచెల్లెళ్లు. అయితే రాజశేఖర్ పెద్ద కూతురి కంటే చిన్న కూతురు ముందు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. శివాని నటించిన చిత్రాలు రెండూ కూడా ఓటీటీ లోనే విడుదలయ్యాయి.

ఇక మోడలింగ్ రంగంపై ఆసక్తి ఎక్కువగా ఉన్న శివాని తరచూ తన ఫోటో షూట్లను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.తాజాగా ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ టు ది లవ్‌లీ లేడీస్’ అంటూ రాసుకొచ్చింది.
ఇక ఈ పోస్ట్ కు చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. శివాని కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఇక అమ్మడిని తెగ పొగిడేస్తున్నారు. శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టాప్ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. ఇక శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోంది.ఇక తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించిన వారు కూడా టాప్ ఫైనలిస్టుల్లో ఉన్నారు. ఇక శివాని రాజశేఖర్ కనుక మిస్ ఇండియా టైటిల్ విన్ అయితే మాత్రం ఇక తన కెరీర్ దూసుకుపోతుంది.

































