Shivani Rajashekhar : హీరోల పిల్లలు సినిమా ఇండస్ట్రీలోకి రావడం కామన్. హీరోల కొడుకులు హీరోలు అవుతుంటారు. కానీ అమ్మయిలు హీరోయిన్లుగా చాలా తక్కువగా ఉంటారు. బాలీవుడ్ లోనూ మన సౌత్ లో కొలీవుడ్ లోనూ ఆ కల్చర్ ఉంది కానీ తెలుగులో తక్కువ. మంచు, మెగా ఫ్యామిలీల నుండి లక్ష్మి, నిహారిక వచ్చినా కొన్ని సినిమాలకే పరిమితం అయి ఇంటి దారి పట్టారు. వెబ్ సిరీస్ లాలో నటిస్తూ మంచు లక్ష్మి అయితే ఇతర భాషల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయింది. ఇక మరో హీరో కూతుర్లు సినిమాల్లోకి వచ్చి మెల్లగా తమకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. వాళ్ళే హీరో రాజశేఖర్, జీవిత ల పిల్లలు శివాని, శివాత్మిక. ఇద్దరూ సినిమాల్లో హీరోయిన్లుగా అడుగుపెట్టినా పెద్దమ్మయి శివాని ‘అద్భుతం’ అనే సినిమాతో ఓటిటిలో మొదట లాంచ్ అయింది. ఆ సినిమాలో తన నటనకు మంచి మార్కలే పడ్డాయి.

లేచిపోయానని సోషల్ మీడియాలో రూమర్… అమ్మానాన్న ఎలా ఫీల్ అయ్యారంటే…
ఇక రాజశేఖర్ గారు హీరోగా నటించిన ‘శేఖర్’ అనే సినిమాలో ఆయనకు కూతురుగా నటించింది శివాని. మళ్ళీ ఇప్పుడు వెబ్ సిరీస్ తో ఆకట్టుకోడానికి సిద్ధమైంది. ఆహా ఒరిజినల్స్ లో ‘ఆహా నా పెళ్ళంటా’ అనే వెబ్ సిరీస్ లో హీరో రాజ్ తరుణ్ సరసన నటించింది. ఆ వెబ్ సిరీస్ ఎపిసోడ్స్ చూసి రాజశేఖర్ గారు జీవిత గారు చాలా మెచ్చుకున్నారంటూ చెప్పిన శివాని తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో తన మీద వచ్చిన రూమర్స్ మీద స్పందించింది. తాను విదేశాలకు ట్రిప్ వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టగా లేచిపోయింది అంటూ రూమర్స్ నా మీద స్ప్రెడ్ చేసారు.

ఆ ట్రిప్ లో నాతో పాటు మా కుటుంబం మొత్తం ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో వ్యూస్ కోసం బ్రతికున్న వారినే చంపేస్తున్నారు అలాంటప్పుడు నా మీద లేచిపోయాననే రూమర్ చాలా చిన్నది అనిపించింది. అమ్మ నాన్న కూడా ఇలాంటివి మన చుట్టూ చాలా ఉంటాయి పట్టినుచుకోకు అని చెప్పారు. నేను అంత సీరియస్ గా తీసుకోలేదు కానీ తెలిసిన వాళ్ళు ఫోన్లు చేసి ఏంటి అలా చేశావంట నిజామా అని అడిగినపుడు వారికి సమాధానం చెప్పడానికి చాలా ఇర్రిటేట్ అయ్యాను అంటూ చెప్పింది.



























