sobha shetty: బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే బిగ్ బాస్ కార్యక్రమాలు కంటే ముందుగానే ఈమె కార్తీకదీపం సీరియల్ లో విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించే ప్రేక్షకులను మెప్పించారు.ఈ సీరియల్ లో మోనిత పాత్రలో నటించినటువంటి శోభా శెట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ తర్వాత ఈమె పెద్దగా బుల్లితెర సీరియల్స్ సందడి చేయలేదు అయితే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో 14 వారాలపాటు కొనసాగినటువంటి ఈమె బయటకు వచ్చిన తర్వాత మొదట సారి స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేశారు. ఇందులో భాగంగా తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అందరి సమక్షంలోనే యశ్వంత్ రెడ్డి తనకు ప్రపోజ్ చేస్తూ ఆమె చేతికి ఉంగరం తొడిగారు.
ఇకపోతే శ్రీముఖి శోభాని ప్రశ్నిస్తూ అసలు ఏం చూసి తనని ప్రేమించావు అని అడిగితే తను చాలా కేరింగ్ పర్సన్ అంటూ సమాధానం చెప్పినటువంటి శోభ వెంటనే తన ఇంస్టాగ్రామ్ మొత్తం చూసాను ఎక్కడ కూడా అమ్మాయిల ఫాలోయింగ్ లేదు అందుకే తనని ప్రేమించాను అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
కేరింగ్ పర్సన్..
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరొక నటుడు బిగ్ బాస్ మానస్ బ్రో నీ ఫ్యూచర్ నాకు అర్థం అవుతుంది అంటూ కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఇక యశ్వంత్ రెడ్డి కార్తిక దీపం సీరియల్ లో డాక్టర్ బాబు తమ్ముడు ఆదిత్య పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.































