టాలీవుడ్ హీరో శోభన్ బాబు గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆటైం లో శోభన్ బాబు అంటే ప్రేక్షకులకు విపరీతమైన పిచ్చి ఉండేది.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల లా ఒకవెలుగు వెలిగిన సూపర్ స్టార్ శోభన్ బాబు. అప్పట్లో ఆయనకు లేడీ ఫాన్స్ చాలామందే ఉండేవారు. అయితే తన తర్వాత తనవారసులనేవరిని ఇండస్ట్రీ లోకి తీసుకురాలేదు శోభన్ బాబు.. శోభన్ బాబు కెరీర్ లో దేవత, జీవన తరంగాలు గోరింటాకు లాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి.
శోభన్ బాబు తనకు వచ్చిన రెమ్యునరేషన్ ని ఎక్కువ భాగం భూములపై తన స్థిరాస్తులను పెంచుకున్నారు.. ఇప్పుడు దానివిలువ 80 వేల కోట్లు అని చెబుతున్నారు. ఇక అందరిలాగే హీరో అవకాశాలు తగ్గిపోయాక శోభన్ బాబు తండ్రి పాత్రలు, అన్న పాత్రలు వచ్చాయి. అయితే అవి చేయడానికి ఏమాత్రం ఇష్టపడలేదు శోభన్ బాబు. దాంతో ఆయన సినిమాలో హీరోగా చేయడం మానేసిన తర్వాత పెద్దగా సినిమాల్లో చేయలేదు ఇండస్ట్రీ మొత్తం లో యాక్టర్ గా రిటైర్మెంట్ తీసుకున్న నటుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శోభన్ బాబు మాత్రమే.
ఇక అయన దయాగుణం గురించి ఇప్పుడు చెప్పుకోవాలి. బయట అయన పెద్దగా ఎవరికీ సహాయం చేసినట్లుగా ప్రచారం జరగలేదు కానీ తన చుట్టూ ఉన్నవారికి మంచి సహాయం చేశాడు. అప్పట్లో ఉన్న జనాలు మాత్రం శోభన్ బాబు పిల్లికి బిచ్చం పెట్టడు అంత పిసినారి అంటారు కానీ శోభన్ బాబు తన డ్రైవర్ గా ఉండి రోజు తన కాళ్లు నొక్కే వ్యక్తికి డబ్బులు సహాయం బాగా చేశారు అని చాలామంది చెప్తారు.శోభన్ బాబు మాత్రమే కాదు ఆయన దగ్గర పనిచేసిన డ్రైవర్ కూడా కోటీశ్వరుడే అని చెప్తుంటారు. ఇక అయన కొడుకులు ప్రస్తుతం బిజినెస్ లు చూసుకుంటున్నారు.



























