Featured

ఘోర రైలు ప్రమాదం… రైలు కింద పడి 19 మంది వలస కూలీలా మృతి !!

Published

on

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కావడంతో చేయడానికి పనులు లేవు, దిక్కుతోచని స్థితిలో సొంతూర్లకు వెళ్ళిపోదాం అనుకున్న వలస కూలీలకు మృత్యువు వెంటాడింది. అత్యంత ఘోరమైన ప్రమాదం 19 మంది నిండు జీవితాలను చిదిమేసింది. చాలా మందిని ఆసుపత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళితే.. సొంతూళ్లకు వెళ్ళడానికి కేంద్ర అనుమతి ఇవ్వడంతో వలస కూలీలు అందరు సొంతూళ్లకు వెళదాం అనుకుని రెడీ అయ్యారు. అన్ని సర్దుకుని గురువారం నాటికి మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ చేరుకున్నారు. అప్పటికే రాత్రి అయిపోవడంతో అప్పటి వరకు నడిచి నడిచి అలసిపోయిన వారికి పక్కనే రైల్వే ట్రాక్ కనిపించింది. ఎలాగో లాక్ డౌన్ నడుస్తుంది కదా ఇప్పుడు ట్రైన్లు రావు అనుకున్న వారు అక్కడే పడుకున్నారు. కానీ ఆ రైల్వే ట్రాక్ వారిపాలిట మృత్యు శకటం అవుతుందని వారు ఊహించలేకపోయారు.

తెల్లవారుజామున 5.15 గంటలకు అతివేగంతో ఓక గూడ్స్ రైలు నిద్రిస్తున్న వలస కూలీలపై దూసుకెళ్లింది. అక్కడే వారి జీవితాలను చిదిమేసింది. ఈ దుర్ఘటన మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో కర్మాడ్ రైల్వేస్టేషన్ పరిధిలో ఈరోజు తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 19 మంది వలసకూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 50 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో మహిళలు, చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు సమాచారం. రైల్వే ట్రాక్ పై చెల్లాచెదురుగా పడి ఉన్న క్షతగాత్రులను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

Advertisement

Trending

Exit mobile version