సంచలన తార శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక విషయం ద్వారా నానా హంగామా సృష్టిస్తుంది.ఈ క్రమంలోనే అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తూ తన అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతుంటారు. చాలా రోజుల తర్వాత లైవ్ లో మాట్లాడిన శ్రీ రెడ్డికి అభిమానులు ప్రశ్నల వర్షం కురిపించారు.

ఈమె సినిమాలలో నటించడం కన్నా నెట్టింట్లో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటుంది. తాజాగా లైవ్లో మాట్లాడుతున్న శ్రీ రెడ్డికి అడుగడుగునా అభిమానులు ప్రశ్నలు వేస్తూ ఆమె నుంచి ఎన్నో సమాధానాలు రాబట్టారు. టీ షర్ట్ పొట్టి నిక్కరు ధరించి అందాలను ఆరబోస్తూ నెటిజన్లను శ్రీరెడ్డి రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే ఒక నెటిజన్ తన ఫోన్ నెంబర్ చెప్పాలని ప్రశ్నించడంతో అందుకు శ్రీరెడ్డి 36-28-40 అంటూ తన సైజులు చెప్పింది.

అదేవిధంగా మరొక నెటిజన్ తెల్ల తోలు అంటూ ఆమెను కామెంట్ చేయగా అందరూ తెల్లతోలు అంటారు కానీ దాన్ని వాడితే మాసిపోవడం తప్ప ఏమీలేదని శ్రీరెడ్డి తన కలర్ గురించి ఘాటుగా సమాధానం చెప్పారు. అలాగే మీరు ఎవరితో నైనా డేట్ లో ఉన్నారా అని అడగగా ప్రస్తుతానికి ఎవరితోనూ లేనని త్వరలోనే ఒక పర్ఫెక్ట్ వ్యక్తితో డేట్ చేస్తానని చెప్పారు. అలాగే మందు తాగే అలవాటు ఉందా అని అడగడంతో శ్రీ రెడ్డి వైన్ తాగుతానని నిర్మొహమాటంగా చెప్పారు.
ఇక ఈ లైవ్ సేషన్ లో భాగంగా మీ జుట్టును వెనక్కి వేసుకో అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయడంతో అందుకు శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసింది. జుట్టు వెనక్కి తీయమంటారేంట్రా వెధవల్లారా?.. నా జుట్టు వెనక పెద్ద ఖజానా ఉంది. అది కేవలం నా బాయ్ ఫ్రెండ్ కి మాత్రమే చూపిస్తా అంటూ శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేసింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత లైవ్ లో పాల్గొన్న శ్రీ రెడ్డి అభిమానులకు కావలసినంత వినోదాన్ని పంచుతూ తన అందాలను చూపెడుతూ రెచ్చగొట్టిందని చెప్పవచ్చు.





























