Shraddha Srinath: శ్రద్దా శ్రీనాథ్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు.ఇలా పలు సినిమాలలో నటిగా నటించిన ఈమెకు విపరీతమైన అభిమానులు ఉన్నారు. ఇకపోతే తాజాగా ఒక మీడియా సంస్థపై నటి శ్రద్ధా శ్రీనాథ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు మీడియా సంస్థ శ్రద్ధ శ్రీనాథ్ ఫోటోని ప్రచురించి కింద పేరు మాత్రం శ్రద్ధాదాస్ అని రాయడంతో ఒక్కసారిగా ఈమె మండిపడ్డారు. ఈ విషయంపై స్పందించిన శ్రద్దా శ్రీనాథ్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్న మీకు కనీసం నా పేరు కూడా తెలియదా? అలాగే తన పేరును ఎంతో స్పష్టంగా పలుకుతున్న అభిమానులకు ఈమె కృతజ్ఞతలు తెలిపారు. మీ కీ బోర్డులో కపూర్, దాస్ వంటి పదాలు వస్తున్నప్పటికీ మీరు ఎంతో ఓపికగా శ్రద్దా శ్రీనాథ్ అని టైప్ చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో తన పేరును శ్రద్దా రామ శ్రీనాథ్ అని మార్చుకున్నానని బహుశా ట్విట్టర్లో కూడా అలాగే మార్చుకోవాల్సి వస్తుందేమోనని ఈమె తెలిపారు. ఇకపోతే రామ అనే పదం తన తల్లి పేరు అంటూ ఈ సందర్భంగా ఈమె క్లారిటీ ఇచ్చారు. ఇకపోతే ఈ విషయంపై మీరు చింతించకండి మీరు కేవలం శ్రద్ధ శ్రీనాథ్ అని మాత్రమే పిలిస్తే చాలు.

Shraddha Srinath: ట్విట్టర్ కు బ్రేక్ ఇచ్చిన శ్రద్దా శ్రీనాథ్…
కొంతమంది పెద్ద పెద్ద మీడియా సంస్థకు చెందిన జర్నలిస్టులు సైతం తన పేరును సరిగ్గా రాయలేకపోతున్నారని బహుశా వాళ్ళు జర్నలిజం క్లాసులు సరిగ్గా వినలేదేమో, అయితే ఇకపై తన పేరును సరిగ్గా రాయమని ఈమె వెల్లడించారు. ఇదిలా ఉండగా కొన్ని కారణాల వల్ల తాను ఒక నాలుగు నెలల పాటు ట్విట్టర్ కు బ్రేక్ ఇస్తున్నానని, నాలుగు నెలల తర్వాత తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఈ సందర్భంగా ఈమె వరుస ట్వీట్స్ చేశారు.
I appreciate people who get my name right. So much. Even though your keyboard suggests Das or Kapoor, every fibre of your body tells you that Srinath is the one to type. I appreciate you. I see you. You are loved.
— Shraddha Srinath (@ShraddhaSrinath) August 3, 2022





























