Shriya Saran : మన టాలీవుడ్ మోస్ట్ గ్లామర్ హీరోయిన్స్ లో హీరోయిన్ శ్రియా శరన్ కూడా ఒకరు. ఇష్టం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక కెరీర్ మొదట్లో చిన్న చిన్నసినిమాలు చేసిన ఆ తరువాత వరుసగా పెద్ద సినిమాలు చేసి స్థార్ హీరయిన్ గా ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాదించుకుంది. టాలీవుడ్ లో మెగా స్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి సీనియర్ హీరోస్ తో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక సీనియర్ హీరోస్ తో ఎలాంటి విజయాలను అందుకుందో అలానే మిడిల్ ఏజ్ హీరోస్ తోకూడా నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక హీరోయిన్ శ్రియా శరన్ 19మార్చ్ 2018 రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ ని పెళ్లిచేసుకుంది .

ఇక అసలు విషయానికి వెళ్ళితే, హీరోయిన్ శ్రేయ శరన్ పెళ్లి చేసుకున్నతరువాత కూడా పలు సినిమాలు వెబ్ సిరీస్ చేస్తున్నది. ప్రతి హీరోయిన్ ఓ పక్క సినిమాలు సైన్ చేస్తూనే, ఓ పక్క యాడ్స్ చేస్తున్నారు, అలానే పలు హీరోయిన్స్ కూడా యాక్టింగ్ చేస్తూనే వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే పలు సెలెబ్రిటీస్ పలు వ్యాపారాల్లో అడుగుపెట్టి విజయవంతం అవుతున్నారు.

ఇక హీరోయిన్ శ్రేయ కూడా 2011లో ముంబయిలో శ్రీ పేరుతో ఓ స్పా సెంటర్ ని ఏర్పాటు చేసింది. ఈ స్పా లో వివిధ రకమైన సర్వీసెస్అం దిస్తూ ముందుకు కొనసాగుతోంది. ఇక ఈ స్పా కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ స్పా లో పని చేసే ఉద్యోగస్తులు అందరూ విజువల్లీ ఛాలెంజ్డ్ ముఖ్యం గా గుడ్డి వారైనా ఉద్యోగులే కావడం మరో విశేషం. ఈ స్పా లో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులను నియమించడానికి ప్రత్యేక కారణం ఉంది. శ్రేయ ఢిల్లీ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆమెకు ఈ ఆలోచన వచ్చిందట. అంతే కాదు ఆమెకు సోషల్ సర్వీస్ చేయాలని చిన్నప్పటి నుండి మైండ్ లో ఉంది, దానికి సరైన సమయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రేయ కు ఈ ఆలోచన రావడం, ఈ ఆలోచనకు ఆమె దగ్గర పని చేసే స్టాఫ్ సహాయ సహకారంతో ముందుకు తీసుకు వెళ్లిందట.

మనసుకు నచ్చిన పనులు చేయడం ఆమెకు చాలా సంతోషం అంటూ చెప్తున్నా శ్రేయ, పెళ్లి అయినా తరువాత మాత్రం ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది, నా భర్త నా కుటుంబం నాకు ఉన్నకొద్దీపాటి స్నేహితులుతో చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్తుంది. అలానే ఇక సినీ కెరీర్ విషయానికి వస్తే, నామనసుకు నచ్చిన సినిమాలే చేస్తున్నాను. ఇక సినీ లైఫ్ కాకుండా నా పర్సనల్ లైఫ్ లో నాకు నచ్చిన పనినిచేస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తూ సంతోషంగా ఉంటున్నాను. ఇక నా బిజినెస్ విషయానికి వస్తే 2011లో ముంబయిలో ‘ శ్రీ` పేరుతో మొదలుపెట్టిన స్పా బిజినెస్ చాలా బాగా అభివృద్ధి లోకి వచ్చింది. ఇక మొదటి నుండి ఏదైనా కొత్తగా చెయ్యాలి ‘ నాకంటూ ఒకప్రత్యేక గుర్తింపు ఉండాలి. అలానే ఈ స్పా లో విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులను నియమించడానికి నాకు వచ్చిన ఆలోచనకు అందరి దగ్గర నుండి మంచి అప్లాజ్ రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్పుకోచ్చింది.






























