శృతీహాసన్.. క్రాక్ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చిన ఈ భామ. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలతో పాటు తను చేయబోయే సినిమాలకు సంబంధిచిన వార్తలను ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తుంది. తాజాగా హెరోయిన్ శ్రుతీహాసన్ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో కాసేపు తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన రకరకాల ప్రశ్నలకు చాలా ఓపికగానే బదులిచ్చింది.

ప్రభాస్ సలార్‌లో మీ పాత్ర ఏమిటి? క్రాక్ సినిమాలో చేసినట్టు సలార్ లో కూడా ఫైట్స్ చేస్తారా అంటూ అడిగిన ప్రశ్నకు ‘సలార్‌లో నాది చాలా మంచి పాత్ర. ఆ వివరాలు వెల్లడించడానికి ఇది సరైన సమయం కాదు. అంటూ సమాధానం ఇచ్చింది. ఇక మరో నెటిజన్.. మీ పర్సనల్ మొబైల్ నంబర్ కావాలి ఇస్తారా ? అని అడిగితే.. ‘అబ్బో.. నా నెంబర్ కావాలా అంటూ నవ్వుతూ నో అని చెప్పింది. అలాగే నన్ను పెళ్లి చేసుకొంటావా? అని మరో నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘చేసుకొను’ అంటూ సున్నితంగా తిరస్కరించింది. అదేవిధంగా మీరు వైజాగ్‌కు ఎఫ్పుడు వస్తున్నారు అని అడిగితే.. చిన్నప్పటి నాకు నుంచి వైజాగ్‌తో చాలా అనుబంధం ఉంది. ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాను అని శృతి చెప్పారు.































