ప్రస్తుతం ఉన్న సింగర్స్ లలో డిమాండ్ ఎక్కువగా ఉన్న హీరో సిద్ శ్రీరామ్.. మొదట్లో రెహ్మాన్ తో కలిసి ఎక్కువ పనిచేసే సిద్ ఆ తర్వాత అందరి మ్యూజిక్ డైరెక్టర్లకు వరంగా మారిపోయాడు.. సినిమా హిట్ అవ్వాలంటే సిద్ పాట ఉండాల్సిందే అన్నట్లు తయారయ్యింది పరిస్థితి.. ప్రతి సినిమాలో అయన ఆలపించిన పాట మొదట రిలీజ్ చేసి సినిమా పై బజ్ క్రియేట్ చేస్తున్నారు.ఇండియాలో ప్రస్తుతం టాప్ సింగర్స్‌లో ఒకడిగా దూసుకుపోతున్నాడు సిద్ శ్రీరామ్. ప్రతి చిన్న సినిమా కి సిద్ పాట పాడుతూ ఆ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు..

తాజాగా సిద్ శ్రీరామ్ కు ఘోరమైన అవమానం జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 10cలో ఉన్న ఓ ప్రముఖ ఫబ్‌లో ఓ ఈవెంట్‌కు హాజరైన శ్రీరాంపై నీళ్లు, మద్యం విసిరి కొందరు ఆకతాయిలు అవమానించారు.ఆ ఆకతాయిలను గెటౌట్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు శ్రీరామ్.. వెంటనే పబ్ యాజమాన్యం కలుగజేసుకుని ఆ గొడవను ఆపేశారని తెలుస్తుంది. ఏదేమైనా హైదరాబాద్ కి గెస్ట్ గా వచ్చిన సిద్ ని ఇంతలా అవమాన పరచడం చాలా బాధాకరం.. పబ్ లో ఇతర ప్రముఖులు ఉన్నారని గొడవను బయటకి పొక్కనివ్వలేదు యాజమాన్యం..
ఇక ఈ సంఘటన కు సిద్ ఇప్పటికీ ఫీల్ అయిపొతున్నాడట.. తన ట్విట్టర్‌లో కూడా ఓ విషయం పోస్ట్ చేసాడు.న్నింటికంటే క్రమశిక్షణ అనేది ముఖ్యమంటూ ఈయన ట్వీట్ చేసాడు. అదున్నపుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదంటూ చెప్పుకొచ్చాడు సిద్.ఈ మధ్యే నితిన్ రంగ్ దే సినిమాలో ఈయన పాడిన నా కనులెపుడూ పాట మంచి అప్లాజ్ తెచ్చుకుంది. శశి సినిమాలోని పాట ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉంది.































