Siddhanth Kapoor : బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా మంచి నీళ్లు తాగినంత సులువుగా డ్రగ్స్ తీసుకుంటున్న సెలబ్రిటీలు చాలా మందే ఉన్నారు. ఎప్పటికప్పుడు పోలీసుల దాడుల్లో దొరకడం ఆ తరువాత కొన్నిరోజులు మళ్ళీ మాములే. ఇక ఇపుడు మరో బాలీవుడ్ సెలబ్రిటీ డ్రగ్స్ వాడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు.

శక్తి కపూర్ తనయుడు, శ్రద్ధ కపూర్ సోదరుడు, సిద్ధాంత్ కపూర్ డ్రగ్స్ వాడినట్లు రిపోర్ట్…..
బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్. దాదాపు ఏడు వందలకు పైగా సినిమాలలో నటించాడు. కమెడియన్ గా కామెడీ విలన్ గా చాలా సినిమాల్లో నటించాడు. శక్తి కపూర్ 1990 దశకంలో దాదాపు 400 సినిమాల్లో నటించారు. ఇక క్యాస్టింగ్ కౌచ్ కి సంబంధించిన ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ స్ట్రింగ్ ఆపరేషన్ లో దొరికిపోయి బ్యాన్ ఎదుర్కొన్నాడు. కొంతకాలనికి బ్యాన్ తీసేసాక మళ్ళీ సినిమాల్లో బిజీ అయ్యారు ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో కూడా పార్టిసిపేట్ చేసిన శక్తి కపూర్ కి ఒక కొడుకు, ఒక కూతురు.

కూతురు శ్రద్ధ కపూర్ కూడా బాలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆషికి 2, భాగీ సిరీస్, హాఫ్ గర్ల్ ఫ్రెండ్, సాహో వంటి సినిమాల్లో నటించింది. ఇక ఈమె సోదరుడు సిద్ధాంత్ కపూర్ కూడా సినిమాల్లో నటించాడు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. దాదాపు 20 సినిమాలకు పని చేసాడు. ఇతను బెంగళూరు లోని పార్క్ హోటల్ లో ఆదివారం రాత్రి డ్రగ్స్ పార్టీ లో పాల్గొని డీజే గా వ్యవహరించారు.
Karnataka | Actor Shraddha Kapoor's brother Siddhanth Kapoor detained during police raid at a rave party in a Bengaluru hotel, last night. He is among the 6 people allegedly found to have consumed drugs: Bengaluru Police pic.twitter.com/UuHZKMzUH0
— ANI (@ANI) June 13, 2022
పక్కా సమాచారం మేరకు పోలీసులు హోటల్‌పై దాడి చేసి 35 మందిని అదుపులోకి తీసుకుని, వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో ఆరుగురు డ్రగ్స్ తీసుకున్నట్లు పాజిటివ్‌గా వచ్చింది. సిద్ధాంత్ కపూర్‌తో సహా మొత్తం ఆరుగురిని అరెస్టు చేశామని వారందరిపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద అభియోగాలు నమోదు చేశామని ఈస్ట్ డివిజన్ జిల్లా జనరల్ ఆఫ్ పోలీస్ భీమాశంకర్ ఎస్ గులేద్ తెలిపారు. సోమవారం ఆరుగురిని కోర్టు ముందు హాజరుపరుస్తామని భీమశంకర్ గులేద్ వెల్లడించారు.

































