SIIMA Awards 2023: సైమా అవార్డ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం SIIMA అవార్డ్స్ కండక్ట్ చేస్తారు. అత్యంత గుర్తింపు పొందిన అవార్డ్స్ గా భావిస్తారు. అటువంటి సైమా అవార్డు ను కైవసం చేసుకున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. RRR సినిమాలో కొమరం భీంగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఎన్టీఆర్ ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్… అభిమానుల గురించి మాట్లాడిన మాటలు హృదయంలో నుంచి వచ్చాయని చెప్పవచ్చు. ఎన్టీఆర్ తన ఫాన్స్ పై ఉన్న ప్రేమను మరోసారి బయటపెట్టారు.

కింద పడ్డ నన్ను పైకి లేపారు : ఎన్టీఆర్
ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నందుకు గాను RRR డైరెక్టర్ రాజమౌలి కి అయన థాంక్యూ చెప్పారు. “నన్ను మళ్ళీ మళ్ళీ నమ్మినందుకు నా జక్కన్నకు థాంక్స్.. కొమరం భీం పాత్రకి నేను న్యాయం చేస్తాను అని అయన నన్ను నమ్మినందుకు థాంక్స్ జక్కన్న.. నా సహనటుడు, నా బ్రదర్, చరణ్ కి థాంక్స్. ఫైనల్ గా నా ఫాన్స్.. నా ఒడిదుడుకుల్లో, నేను క్రిందపడ్డప్పుడెళ్ళా నన్ను పట్టుకుని పైకి లేపినందుకు, నా కనుల వెంట వచ్చిన ప్రతి నీటి చుక్కకి వాళ్ళు కూడా భాద పడినందుకు, నేను నవ్వినప్పుడెళ్ళ నాతో పాటు వాళ్ళు కూడా నవ్వినందుకు, నా అభిమాన సొదరులందరికి పాదాభి వందనాలు” అంటూ ఎమోషనల్ అయ్యారు ఎన్టీఆర్. ప్రస్తుతం ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
#JrNTR Complete Speech in #SIIMAAwards2023 #ManOfMasessNTR #JrNTR #RRRMovie #SIIMA #SIIMAinDubai #SIIMA2023inDubai #SIIMA2023 pic.twitter.com/ldMH83hWJQ
— TeluguDesk (@telugudesk) September 16, 2023