సిల్క్ స్మిత అంటే ఇప్పటికీ తెలియని వారు ఉండరు. అంతగా ఆమె ప్రేక్షకుల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగు సినీ పరిశ్రమలోనే కాకుండా దక్షిణాదిలో కూడా ఎన్నో చిత్రాలలో నటించిన సిల్క్ స్మిత గురించి అందరికీ తెలిసిందే, కానీ ఆమె మరణం మాత్రం ఇప్పటికీ మిస్టరీ గానే మిగిలిపోయింది. ఎన్నో చిత్రాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంది ? దానికి కారణం ఏమిటో ఇప్పటికీ తెలియదు. అతి చిన్న వయస్సులోనే సిల్క్ స్మిత స్టార్ట్ డమ్ ని సంపాదించుకుంది. కానీ ఆకస్మాత్తుగా ఆమె మరణించడంతో అభిమానుల హృదయాలు ఒక్కసారిగా బద్దలయ్యాయి.

సిల్క్ స్మిత స్నేహితుడు, ప్రముఖ నటుడు, కన్నడ సూపర్ స్టార్ రవి చంద్రన్ ఆమె మరణం గురించి కొన్ని సంచలన విషయాలు బయటపెట్టడం జరిగింది. 1992లో రవి చంద్రన్, సిల్క్ స్మిత “హల్లి మేస్త్రు” అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత నుండి వాళ్లిద్దరి మద్య స్నేహం ఏర్పడింది. ఆమె చనిపోయే ముందు రోజు వరకు కూడా ఎంతో స్నేహంగా ఉండేది అని రవి చంద్రన్ చెప్పారు, మేము ఇద్దరం ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకునే వాళ్ళం, సిల్క్ స్మిత చనిపోయే ముందు రోజు నాకు ఫోన్ చేసింది, నన్ను కలవాలని ప్రయత్నించింది కానీ కలవడం కుదరలేదు. ఆ సమయంలో నేను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వలన ఆమెను కలవడానికి వీలు పడలేదు. షూటింగ్ లో ఉండడంతో ఆమె కాల్ లిఫ్ట్ చేయలేకపోయా, మామూలుగానే కాల్ చేసింది అనుకోని తిరిగి కాల్ కూడా చేయలేదు.

ఆ తర్వత రోజు తను మరణించినట్టు తెలిసింది. కాల్ లిఫ్ట్ చేసి ఉంటె, తన యొక్క బాధని నాతో పంచుకునేదేమో, అంతే కాకుండా నేను మాట్లాడి ఉంటే పరిస్తితి ఇంకోలా ఉండేది అని, ఆమె మరణం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక చేదు జ్ఞాపకం అని బాధ పడ్డారు రవి చంద్రన్. ఆమె మరణం వెనక వున్న మిస్టరీ ఎప్పటికీ తెలుస్తుందో చూడాలి.
































