సిల్క్ స్మిత ఒకే పాట కోసం మూడు సార్లు డాన్స్ చేయవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది.!!

0
229

1990 దశకంలో రీఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ నాలుగో తరం హీరోయిన్ లతో జత కట్టి కొన్ని విజయవంతమైన సినిమాలను తీశారు. 1993 లో తమ్మారెడ్డి భరద్వాజ్ దర్శకత్వంలో కృష్ణ ఆమని జంటగా పచ్చని సంసారం సంక్రాంతికి విడుదల అయ్యింది. బాక్సాఫీస్ ముందు పరవాలేదు అనిపించుకుంది. తిరిగి కృష్ణ భరద్వాజ్ కాంబినేషన్ లో మరో సినిమా చేద్దాం అని ప్లాన్ చేశారు.

1993 ద్వితీయార్థంలో భరద్వాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ, బ్యూటీ క్వీన్ రంభ హీరో హీరోయిన్లుగా రౌడీ అన్నయ్య సినిమా దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. కానీ సిల్క్ స్మిత తో ఉన్న ఒక పాట బ్యాలెన్స్ గా ఉంది. క్లైమాక్స్ లో వచ్చే ఈ పాట బాబు మోహన్ తో చేద్దామని దర్శకుడు భరద్వాజ్ చెప్పగా.. కాదు నేనే ఆ పాటలో సిల్క్ స్మితతో కనిపించాలని కృష్ణ.. ఇలా ఇద్దరి మధ్య క్లాష్ రాగా చివరికి భరద్వాజ్ మూడు రోజుల పాటు చెన్నై వెళ్ళిపోయారు.

ఆ క్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ పగలు కృష్ణ సిల్క్ స్మితతో.. రాత్రి సమయంలో బాబు మోహన్ సిల్క్ స్మితతో ఈ పాటను పూర్తి చేశారు. కానీ భరద్వాజ ప్రోద్బలంతో బాబు మోహన్ సిల్క్ స్మితల పాట మాత్రమే సినిమాలో వచ్చింది… ఈ సినిమా విడుదలకు ముందు సెన్సార్ కి వెళ్ళినప్పుడు క్లైమాక్స్ పాట విషయంలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారు.

ఆ విషయంలో సెన్సార్ ఆఫీస్ కి వెళ్లి కృష్ణ సినిమా చూడగా అతను సిల్క్ స్మిత పాల్గొన్న పాట తొలగించబడి, బాబు మోహన్ సిల్క్ స్మిత పాట సినిమాలో ఉండడంతో కృష్ణ తీవ్ర ఆగ్రహంతో దర్శకుడు భరద్వాజ్ దగ్గరికి వెళ్లి కరచాలనం ఇస్తూ ఇదే మన చివరి కలయిక ఇక భవిష్యత్తులో నీ ముఖం చూడని వెళ్లిపోయారు… తిరిగి కృష్ణ గారి పర్యవేక్షణలో కృష్ణ సిల్క్ స్మిత ల మధ్య మళ్లీ ఐటమ్ సాంగ్ చిత్రీకరించి సినిమాల్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా సిల్క్ స్మిత ఒకే పాటకు మూడు సార్లు డాన్స్ చేయవలసిన పరిస్థితి వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here