Simhadri Re release : సింహాద్రి 1000 షోలతో రీ-రిలీజ్ రికార్డులే రికార్డులు… ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్…!

0
22

Simhadri Re release : నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తారక్ తాతకు తగ్గ మనవడు అని ఎపుడో నిరూపించుకున్నాడు. నటన, డైలాగు డిక్షన్ వీటిలో ఎన్టీఆర్ ను కొట్టేవాళ్ళు లేరు అనేలా నిరూపించుకున్నాడు. ఇక మొదట్లో కాస్త బోద్దుగా ఉన్నా కూడా డాన్స్ లు ఇరగదీసాడు. కానీ రాను రాను బాగా లావుగా మారి రాఖీ సినిమా సమయానికి చాలా లావుగా హీరోలా ఏమాత్రం లేడు ఎన్టీఆర్, అయినా నటనలోనూ డాన్స్ లోనూ ఏమాత్రం తగ్గలేదు. ఇక యమదొంగ సినిమాలో చిన్నగా మారిపోయి తన అభిమానులకే కాదు అందరికీ షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ కెరీర్ లోనే కాదు తెలుగు సినిమా హిస్టరీలోనే ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సినిమా ‘సింహాద్రి’. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 19 ఏళ్లకే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన ఏకైక హీరోగా నిలిచాడు.

రీ రిలీజ్ తో సింహాద్రి మరోసారి రికార్డ్స్…

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా మరోసారి ఇండస్ట్రీ రికార్డ్స్ ను షేక్ చేయడానికి సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేసారు. మొత్తం 1000 స్క్రీన్స్ మీద రిలీజ్ చేసిన ఈ సినిమా మరోసారి రికార్డ్స్ సృష్టిస్తోందంటూ కొందరు సీనియర్ జర్నలిస్ట్స్ అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ కెరీర్ లో మొదట్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూస్తూనే మరోవైపు ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అలాగే కెరీర్ లో విభిన్నమైన పాత్రలను చేసాసు ఎన్టీఆర్. ఒకవైపు హీరోగా మరోవైపు కామెడీ క్యారెక్టర్ చారిగా కూడా అదుర్స్ లో అలరించాడు.

ఇక జై లవకుశలో విలన్ షేడ్ లో కూడా అలరించిన ఆయన టెంపర్ సినిమా టైం నుండి తన సినిమా ఎంపిక మరింత మారిపోయింది. అభిమానులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే యంగ్ టైగర్ టెంపర్ సినిమా సమయంలో అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం మంచి కథలను అలాగే నటనకు ఆస్కారమున్న పాత్రలను ఎంచుకుంటున్నారు. ఇక ఇటీవలే వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమరం భీముడు పాత్రలో అందరినీ మరోసారి ఆకట్టుకున్నారు.