సిద్దిపేటకు కూతవేటు దూరంలో ఓ పల్లెటూరు. ఆ గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబంలో నరసింహాచారి జన్మించాడు. వృత్తిరీత్యా స్వర్ణకారుడు కావడం మూలంగా పట్టణంలో తన వృత్తిని కొనసాగించేవాడు. ఆ వృత్తిని కొనసాగిస్తూనే సినిమా పట్ల ఆకర్షితడు అయ్యాడు. ఆ క్రమంలో చిరంజీవి, మోహన్ బాబు, పవన్ కళ్యాణ్ సినిమాలను ఎక్కువ చూసేవాడు. ఎలాగైనా సినిమాల్లో చేరాలని తన స్నేహితులతో తరచూ అనేవాడు. అలా కాళీ సమయాల్లో హైదరాబాద్ వస్తూ సినిమాల కోసం ప్రయత్నిస్తూ ఉండేవాడు.

అలా ఖాళీ కడుపుతో కృష్ణానగర్,ఫిల్మ్ నగర్ లో తిరుగుతున్న సమయంలో హృదయం కాలేయం డైరెక్టర్ స్టీవెన్ శంకర్ తో పరిచయం ఏర్పడింది. ఎడారిలో బిస్లరీ వాటర్ బాటిల్ దొరికినట్టు ఒక్కసారి సంపూర్ణేష్ బాబు ఆశలకు రెక్కలొచ్చాయి. ఇప్పుడు టైం లేదు మనం ఎప్పుడైనా కలిసి కూర్చొని మాట్లాడదాం.. నువ్వు హైదరాబాదు పని మీద వచ్చినప్పుడు నాకు ఫోన్ చెయ్ కలుద్దామని స్టీవెన్ శంకర్ వెళ్ళాడు. అలా తిరిగి ఊరు వెళ్లిన తర్వాత తనకు హైదరాబాదులో పని లేనప్పటికీ హైదరాబాద్ వస్తున్నానని స్టీవెన్ శంకర్ కు ఫోన్ చేశాడు.

అలా స్టీవెన్ శంకర్ కలిసినప్పుడు నువ్వు ముద్ద పప్పుల డాన్స్ చేస్తూ ఒక సాంగ్ రికార్డు చేసుకొని రా అని చెప్పారు. అప్పటికీ స్టీవెన్ శంకర్ తిరుగు ప్రయాణానికి కి డబ్బులు ఇవ్వబోగా సంపూర్ణేష్ బాబు తీసుకోలేదు. మళ్లీ ఓ సందర్భంలో స్టీవెన్ స్టీవెన్ శంకర్ కలవగా జాతరలో పూల చొక్కాలు కొనుక్కొని కనిపించమన్నాడు.ఇలా చెప్పడంతో స్టీవెన్ శంకర్ నిజంగానే సినిమా చేస్తున్నాడా.?అసలు నేను అందులో హీరోనా.? ఇలాంటి మిలియన్ డాలర్ల ప్రశ్నలు తన మైండ్లో గిరగిర తిరిగాయి.

అలా స్టీవెన్ శంకర్ దర్శకత్వంలో సంపూర్ణేష్ బాబు హీరోగా హృదయం కాలేయం సినిమా2014 ఏప్రిల్ 4 నా విడుదలయింది. ఫన్ అండ్ సెటైరికల్ సినిమా కావడంతో మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ బాక్సాఫీస్ ముందు విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత పెసరట్టు, సింగం123, వేర్ ఈజ్ విద్యా బాలన్, కొబ్బరి మట్ట మొదలగు సినిమాల్లో నటిస్తూ మంచి పొజిషన్లో సంపూర్ణేష్ బాబు ఉన్నారు.

అయితే సంపూర్ణేష్ బాబు సొంతూరు వెళ్ళినప్పుడు వేప పుల్లతో పళ్ళు తోముకోవడం, మామూలు సైకిల్ మీద వెళ్లి నిత్యావసరాలను తెచ్చుకోవడం జరుగుతుంది. తన పాత ఇల్లు, భార్యా పిల్లలతో మామూలు జీవితం సంపూర్ణేష్ బాబు గడపడాన్ని గ్రామస్తులు ఇప్పటికీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు.



























