లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. ఈ సమయంలో ఎక్కువ మంది ఉబకాయులు పెరుగుతూ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంట్లోనే ఉండండి.. కాలు బయట పెట్టొద్దు అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇళ్ళ నుండి బయటికి రావడం లేదు. దీని వల్ల అధిక బరువు ఉన్న వాళ్లకు కొద్దిగా సమస్య అనే చెప్పాలి.

ఇంతకు ముందు అయితే ఏదోక రకంగా బరువు తగ్గించుకునే పనిలో ఉండేవాళ్ళు. జిమ్ కి వెళ్ళడం, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలా ఏదోక రకంగా బయటకి వెళ్ళి ఆరోగ్యం మీద దృష్టి పెట్టేవాళ్ళు.ఇపుడు ఉన్న పరిస్థితుల్లో బయటకు వెళ్లే అవకాశం లేకపోవడం శరీరానికి తగిన శ్రమ లేకపోవడంతో బరువు పెరిగే అవాశాలున్నాయి.

ప్రభుత్వం చెప్పేది కూడా మన మంచికే కాబట్టి ఇంట్లో ఉండే మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించుకోవాలి. ఇళ్లలో ఉండి బరువు ఎలా తగ్గాలి అనే దాని గురించి తెలుసుకుందాం. పొద్దున, సాయంత్రం కాసేపు ఎండలో నడవడం అలవాటు చేసుకోండి. అలా శరీరానికి సూర్య రష్మి తగలడం వలన విటమిన్-డి కూడా అందుతుంది అంతే కాకుండా ప్రతి రోజూ పొద్దున అరగంట నడవడం వలన 150 వరకు కెలోరీలు ఖర్చవడం ఖాయం.

ప్రభుత్వం కూడా ఇంట్లో ఉండే చిన్నపాటి ఎక్సయిర్సైజ్ లు చేస్తూ నడక మరియు మంచి ఆహారం తీసుకొని రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది అనకుండా ఇంటికి సంబంధిచిన మరియు చేయాలనుకొని చేయకుండా వదిలేసిన పనులు చేసుకోండి, మరియు ఇంటిని క్లీన్ చేసుకోవడం, మొక్కలకు సంబంధిచిన చిన్న చిన్న పనులను చేస్తే శరీరానికి మంచి కదలిక ఉంటుంది.

ఇంట్లోనే ఉండమన్నారు కదాని టీవీలు,సెల్ ఫోన్, లాప్ టాప్ లు దగ్గరే కూర్చొనుండకుండా ఇంట్లో పనులను వాయిదా వేయకుండా చేస్తూ ఉంటే మంచిది. ఇంట్లో ఉన్న మెట్లు ఎక్కి దిగుతూ ఉండడం కూడా మేలు చేస్తుంది తినే ఆహారం విషయంలో కూడా కొంత జాగ్రత్త లు తీసుకుంటూ సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బరువుని అదుపులో ఉంచుకోవచ్చు.

తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం చాక్లెట్స్, ఐస్ క్రీం, జంక్ ఫుడ్స్ వంటివి తినకుండా మితంగా ఆహారం తీసుకుంటూ ఉంటే ఇంట్లోనే కొద్ది పాటి ఎక్సయిరేసైజ్ లు చేస్తూ ఉండటం వలన బరువు పెరగడం అనే సమస్యని తగ్గించుకోవచ్చు.






























