Simran : తెలుగులోనే కాక తమిళ, మలయాళ వంటి పలు భాషలలో అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తార సిమ్రాన్. తెలుగులో కలిసుందాం రా, సమరసింహా రెడ్డి, నరసింహానాయుడు వంటి బ్లాక్ బస్టర్స్ తన ఖాతాలో ఉన్నాయి. ఇక అగ్ర హీరోయిన్ గా వెలిగి దాదాపు దశాబ్దం పాటు నెంబర్ వన్ కుర్చీలో కూర్చుంది. ఇక అందమే కాకుండా, నటన, డాన్సులతో అభిమానులను ఆకట్టుకుంది. అప్పట్లో సోషల్ మీడియా అంత లేదు కాబట్టి అమ్మడి ప్రేమ వ్యవహారం పెద్దగా ఈ తరంకి తెలియదు కానీ అప్పట్లో ఒక హీరోతో సిమ్రాన్ పీకల్లోతు ప్రేమ వ్యవహారం నడిపించిందని చాలా మందికి తెలియదు.

తమిళ హీరోతో ప్రేమాయణం.. ఆపై బ్రేక్ అప్…
సిమ్రాన్ మనసు దోచుకున్న ఆ హీరో ఎవరో కాదు విశ్వ నటుడు కమల్ హాసన్. కమల్ తో సిమ్రాన్ పంచతంత్రం అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది. ఈ సినిమా తమిళంలో మంచి హిట్ కానీ తెలుగులో అనువాద చిత్రంగా వచ్చి ఫ్లాప్ అయింది. అయితే ఈ సినిమా వల్ల సిమ్రాన్ కమల్ ఒకరికి ఒకరు పరిచయం అవడమే కాక ప్రేమలో కూడా పడ్డారట. కమల్ హాసన్ తో కలిసి డేటింగ్స్, పబ్ లంటూ బాగా తిరిగాక అప్పటికే కమల్ కి సారిక తో పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్నారనే విషయం ఆలస్యంగా తెలుసుకుని బాగా హర్ట్ అయిందంట సిమ్రాన్.

ఇక మెల్లిగా కామల్ కి దూరం జరిగి అతనికి బ్రేక్ అప్ చెప్పేసిందట. ఇక ఆ తరువాత సారిక కమల్ విడాకులు, కమల్ హసన్, గౌతమీ తో సహజీవనం చేయటం ఇవన్నీ తెలిసిన విషయాలు. ఇక సిమ్రాన్ కూడా దీపక్ బగ్గా అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని సెటిల్ అయింది. ఇక వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన సిమ్రాన్ నటనా ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేస్తూ అలరిస్తోంది. ఈ మధ్యలో కమల్ తో దృశ్యం సినిమాలో నటించే అవకాశం వచ్చినా చేయనని చెప్పిందట సిమ్రాన్.

































