Sindhu Menon : కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన సింధుమీనన్ మన టాలీవుడ్ లో కూడా మంచి సినిమాలలో నటించి అభిమానులకు చేరువ అయ్యింది. చిన్నతనంలోనే భరతనాట్యం నేర్చుకున్న సింధుమీనన్, కన్నడ సినిమాలలో బాలనటిగా మొదటి రంగప్రవేశం చేసింది. తర్వాత తాను 13 సంవత్సరాల వయసు లోనే కన్నడ సినిమా లో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. సింధుమీనన్ 15 సంవత్సరాల వయసులో భద్రాచలం సినిమా తెలుగులో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత కన్నడ తెలుగు తమిళ్ మలయాళం ఇలా అన్ని దక్షిణ భాషల్లోనూ హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది.
అంతేకాకుండా సింధు మలయాళంలో బుల్లితెర మీద కూడా ఒక ప్రోగ్రాం కు హోస్ట్ గా వ్యవహారించింది. 2007 లో కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సింధు మీనన్ ప్రభు అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి వివాహం చేసుకుంది.

సింధు మీనన్ ఇపుడు ఇలా…
వివాహం తరువాత సింధు మీనన్ సినిమా ఇండస్ట్రీలో పెద్ద యాక్టివ్ గా ఉండటం లేదు. అయితే పెళ్లి తరువాత సింధు యూకే లో స్థిరపడినట్టు సమాచారం. దీంతో ప్రస్తుతం సింధు తన భర్తకి వ్యాపారాల్లో చేదోడుగా ఉంటోంది. అయితే వీరికి ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు మొత్తం ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఇటీవల హీరోయిన్ సింధు మీనన్ తన భర్త పిల్లలతో తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సినిమాలలో చుసిన సింధు మీనన్ ఫోటో లో వున్న సింధు ఒకటేనా అని చర్చించుకుంటున్నారు.

సింధు మీనన్ హీరోయిన్ గా తెలుగు, తమిళం, మలయాళం భాషలలో దాదాపు 20కి పైగా చిత్రాలలో నటించింది. అయితే ఆ మధ్య సింధు మీనన్ గురించి ఇంకొక వార్త కూడా వైరల్ అయింది. నటి సింధు మీనన్ పై బెంగళూరులో మనీ చీటింగ్ కేసు కూడా నమోదైంది అని, కానీ ఆ తర్వాత కొంతమంది సినీ పెద్దల సమక్షంలో ఈ కేసు సెటిల్ అయినట్టు సమాచారం.

































