Singer Kousalya : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా… రా రమ్మని రారా రమ్మని అంటూ తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్న సింగర్ కౌసల్య. 99లో పాడుతా తీయగా సింగింగ్ షోలో విన్నర్ గా నిలిచి ఆపైన సినిమాల్లో అవకాశాలను అందుకుని సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య నిజ జీవితంలో మాత్రం భర్త వేధింపులకు చాలా బాధపడింది. చివరకు 2015లో విడాకులు తీసుకుని ప్రస్తుతం తాను ఒక్కతే కొడుకును చూసుకుంటూ కెరీర్ లోనూ ముందడుగు వేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన వ్యక్తిగత జీవితం గురించి అలానే తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.

కడుపుతో ఉన్నపుడు రోడ్డు మీద వదిలేసాడు…
కౌసల్య గారు చిన్నవయసులోనే పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొంత కాలానికే భర్త వేధింపులు మొదలయ్యాయి. కొడుకు కార్తికేయ పుట్టాక వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. పిల్లాడి కోసం ఎంతో భరించినా చివరకు భర్త తనకు తెలియకుండా మరో మహిళతో ఉన్నాడు అని తెలిసాక 2015లో కౌసల్య విడాకులు తీసుకుంది. మొదట్లో భర్త కొడుతున్నా మారుతాడు అని భరించిన కౌసల్య అతను పెట్టే టార్చర్ బాగా భరించానని తెలిపారు. ఇక ఒక బిడ్డ పుడితే మారుతాడని నేను భావించాను. నా భర్త తరుపు వాళ్ళు నా భర్త ఒక బిడ్డ పుడితే పడుంటుంది ఎక్కడికి పోతుందని భావించారు అంటూ తెలిపారు.

ఒకసారి ఏడో నెల గర్భవతిగా ఉన్న సమయంలో తల్లిని చూడాలనిపించి తన తల్లి వద్దకు వెళ్లాలనుకుంటే భర్త నడిరోడ్డు మీద వదిలేసి నడుచుకుంటూ వెళ్ళిపో అని చెప్పాడట. దాదాపు మూడు మైల్లు నడిచి తల్లి ఇంటికి వెళ్లినట్లు చెప్పి ఎమోషనల్ అయ్యారు కౌసల్య. అయితే మరో మహిళతో సంబంధం ఉందని తెలిసిన తరువాత విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట కౌసల్య. ప్రస్తుతం తన కొడుకు మాత్రమే తన ప్రపంచం అని తెలిపారు కౌసల్య.



































