ఇటీవలి కాలంలో సెలబ్రిటీలకు రెండో పెళ్లి వార్తలు నేట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గత ఏడాది దిల్ రాజు రెండో పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది మొదట్లో రెండో వివాహం చేసుకున్నారు సింగర్ సునీత. ఆ తరువాత నటి సురేఖా వాణి రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ అనేక కథనాలు వచ్చాయి. తాజాగా సింగర్, బిగ్ బాస్ ఫేం నోయల్ రెండో పెళ్లిపై సోషల్ మీడియాలో చర్చ మొదలయ్యింది.

గతంలో సింగర్ నోయల్, హీరోయిన్ ఎస్తర్ ప్రేమ వివాహాం చేసుకున్నారు. అయితే పెళ్ళైన కొన్నాల్లకే ఈ ఇద్దరూ వేరు పడ్డారు. కోర్టు ఉత్తర్వులు రావడంతో అధికారికంగా గత ఏడాది ఈ ఇద్దరూ కూడా తమ విడాకుల విషయాన్ని బయటపెట్టారు. ఇక తాజగా నోయల్ మరోసారి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడని వార్త హాల్చల్ చేస్తోంది.
దీనికి కారణం తాజాగా సోషల్ మీడియాలో ఓ ఎగ్జైటింగ్ న్యూస్ మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను.. ఈ విషయం చెప్పాలని ఎంతో ఆత్రుతగా ఉంది.. ఆగలేకపోతోన్నా అంటూ ఒక చెప్పాడు. ఇక అప్పటి నుంచి నోయల్ ఎం చెప్పబోతున్నాడా అంటూ ఆలోచిస్తున్నారు. నోయల్ తన రెండో పెళ్లికి సంబంధించిన వార్త చెప్పబోతున్నాడెమో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయన అభిమానులు.



























