Singer Smita: సినీ ఇండస్ట్రీకి చెందిన సింగర్ స్మిత గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె తన పాటలతో ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. తన స్వరంతో ఎంతోమందిని ఆకట్టుకుంది. తను మొదట్లో పాడిన హైరబ్బా, మసక మసక చీకటిలో వంటి పాప్ సాంగ్స్ కు అప్పట్లో బాగా క్రేజ్ ఉండేది.

ఇక పలు సినిమాలలో ఎన్నో సాంగ్స్ పాడి ఆకట్టుకుంది. కొన్ని సినిమాలలో కూడా కనిపించింది. ఇక బుల్లితెరపై కూడా పలు షోలల్లో జడ్జిగా చేసింది. ఇక ప్రస్తుతం ఆమె ‘నిజం విత్ స్మిత’ అని టాక్ షోలో హోస్టుగా చేస్తుంది. ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది.
ఇక యాంకర్.. తనను.. మీది లవ్ మ్యారేజ్ కదా.. మీ విషయాలల్లో హస్బెండ్ ఎలా సపోర్ట్ చేస్తాడు అని అడగటంతో.. వెంటనే స్మిత తన విషయంలో తన హస్బెండ్ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అని.. తన వాయిస్ కి తన హస్బెండ్ పెద్ద ఫ్యాన్ అని తెలిపింది. తన భర్త పేరు శశాంక్ అని.. తమది లవ్ కం అరేంజ్ మ్యారేజ్ అనుకోవచ్చు అని తెలిపింది.

Singer Smita:
ఎందుకంటే తనకున్న ఫ్రెండ్ సర్కిల్ లో తన భర్త కూడా ఒకరని.. ఇక తన ఫ్రెండ్స్ అంతా ఆయనను బావ అంటారని.. తను కూడా అలాగే పిలిచే దాన్ని అని తెలిపింది. ఇక తమ మ్యారేజ్ అప్పటికి తన వయసు 21 ఏళ్లని.. దీంతో తమ లవ్ విషయం అక్కినేని నాగార్జున అన్నయ్య అయినా అక్కినేని వెంకట్ తమ రెండు ఫ్యామిలీకి తెలిపి ఒప్పించాడని తెలిపింది. ఇక తమకు ఒక పాప ఉందని తెలిపింది.





























