Sunitha insta post viral : 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా అడుగుపెట్టి ఎన్నో పాటలను ఎన్నో భాషలలో పాడిన సునీత తెలుగు నాట పరిచయం అక్కర్లేని సింగర్. మూడువేలకు పైగా పాటలను దక్షిణాది అన్ని భాషలలో పాడిన సునీత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. ఇక అటు పాటలతో అలరిస్తూనే టీవీ షోలతోను బిజీగా ఉంది. ఇక మరోవైపు తన వ్యవసాయక్షేత్రంలో వ్యవసాయ పనులు చేస్తూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంటుంది.

చెరుకు జ్యూస్ కావాలా……
ఇక ఇలానే ఇపుడు కూడా ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. కారులో వెళ్తున్న ఆమెకు మార్గమధ్యంలో చెరకు గానుగ కనిపించింది. ఇక వెంటనే కారు దిగి గానుగను తిప్పుతూ చెరుకు రసం తీసింది. చెరుకు రసం కావాలా… సమ్మర్ గ్లో అంటూ అభిమానులను అడిగింది. ఇక ఈ వీడియోకు చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఇదొక మంచి వర్కౌట్ మేడమ్ సూపర్ అంటూ స్పందించారు.
ఇటీవలే మామిడికాయ చేత్తో పట్టుకుని బ్లెస్సెడ్ అని పెట్టడంతో సునీత ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అది వాస్తవం కాదని తొలిపంట మామిడి అని అలా పెట్టానని జనాలు మరీ క్రేజీగా తయారయ్యారంటూ స్పందించిన సునీత ఇక ఇపుడు గానుగ నుండి చెరుకు రసం తీస్తూ ఉల్లాసంగా కనిపించారు.































