Sunitha pregnency rumours : 17 ఏళ్లకే ప్లే బ్యాక్ సింగర్ గా అడుగుపెట్టి ఎన్నో పాటలను ఎన్నో భాషలలో పాడిన సునీత తెలుగు నాట పరిచయం అక్కర్లేని సింగర్. మూడువేలకు పైగా పాటలను దక్షిణాది అన్ని భాషలలో పాడిన సునీత కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. కానీ వ్యక్తిగతంగా మాత్రం జీవితంలో వడిదుడుకులను ఎదుర్కొని నిలిచింది. చిన్న వయసులో 19ఏళ్లకే కిరణ్ గోపరాజు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల తరువాత వాళ్లిదరు 2017 లో విడాకులు తీసుకుని విడిపోయారు.

ఇద్దరు పిల్లల తల్లిగా అటు కెరీర్ ను బాలన్స్ చేసిన సునీత…
ఇక భర్తతో విడిపోయాక తన పిల్లతో అటు పర్సనల్ లైఫ్, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేస్తూ కెరీర్ లోను రాణించిన సునీత. భర్త కిరణ్ తో విడాకులు తీసుకున్న నాలుగేళ్లకు 2021 లో ప్రముఖ పారిశ్రామికవేత్త రామ్ వీరపనేని ని వివాహం చేసుకున్నారు. రామ్ మ్యాంగో మ్యూజిక్ అధినేత. మ్యూజిక్ ఇండస్ట్రీలో మొఘల్ గా ఆయన్ను అభివర్ణిస్తారు. ఇక రెండో పెళ్లి తర్వాత సునీత మరింత ఆక్టివ్ గా తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. అటు టెలివిజన్ లోనూ అనేక కార్యక్రమాలకు వాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.

ఇక శనివారం ఇంస్టాగ్రామ్ ద్వారా సునీత పెట్టిన పోస్ట్ ఇపుడు అనేక అనుమానలకు తెర తీసింది. ఒక ఫొటోలో సునీత మామిడికాయను చేతిలో పట్టుకుని ఉండటం కాప్షన్ బ్లెస్సెడ్ అని రాయటం తో అందరు సునీత గర్భవతి అంటూ భావిస్తున్నారు. ఇక మరో పుకారు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సునీత సరోగసి ద్వారా తల్లి అవ్వాలనుకుంటోందని వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాలపై సునీత కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ క్లారిటీ ఇవ్వాల్సిన ఉంది.



































