‘నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా..’ అంటూ సాగే ఈ పాట ప్రస్తుతం సంగీత ప్రియుల హృదయాలలో మారు మ్రోగిపోతూ.. యూట్యూబ్ లో రికార్డులు బద్దలు కొడుతోంది. ప్రముఖ బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచినేని ఫస్ట్ తొలిసారి హీరోగా.నటించిన ’30 రోజులో ప్రేమించడం ఎలా.?’ చిత్రం కోసం టాలీవుడ్ టాప్ సింగర్స్ సిద్ధూ శ్రీరామ్, సునీతలు కలసి పాడిన ఈ పాట నవతరాన్ని ఉర్రూతలూగిస్తోంది. ఇక ఈ పాటకు ప్రాణం పోసిన సింగర్ సునీత కోసం చెప్పాలంటే.. గాయనిగా ఆమెది పాతికేళ్ళ సినీ ప్రస్థానం. ఆమె పాట తేనెల ఊటగా ఉంటుంది. ఆమె గొంతులో ఏదో తెలియని గమ్మత్తు దాగి ఉంది. ఆమె ఆ తరం, ఈ తరం అని కాకుండా అన్ని తరాలను తన పాటలతో అలరించిందనే చెప్పవచ్చు.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టాలీవుడ్ ని కరోనా మహమ్మారి కభలిస్తోంది. పెద్ద పెద్ద సినీ నటీనటుల దగ్గర నుంచి చిన్నచిన్న ఆర్టిస్ట్ ల వరకు అందరూ కోవిడ్ 19 వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బాద్ షా అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఫ్యామిలీ మెంబర్స్ కరోనాను జయించారు. లేటెస్ట్ గా మన గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్యణ్యం, హీరోయిన్ నవనీత్ కౌర్, రానా వంటి సినీ ప్రముఖులు కరోనాతో పోరాడుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి ప్రముఖ సింగర్ సునీత కూడా చేరి.. తాను కరోనా బారిన పడినట్లు స్వయంగా ఆమె వీడియో ద్వారా తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం ఓ ప్రోగ్రాం షూటింగ్ టైంలో తనకు తలనొప్పి రావడంతో అనుమానమొచ్చి టెస్ట్ చేయించుకోగా కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని, తనకు కరోనా సోకిందని..

అప్పటి నుంచి వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హోం క్వారంటైన్ లో ఉండి ప్రస్తుతం పూర్తిగా ఆ వ్యాధి నుంచి కోలుకున్నాని, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా తెలిపారు. ఈ వీడియో కొనసాగింపుగా సింగర్ సునీత మాట్లాడుతూ.. కరోనా వైరస్ తో పోరాటం అంత సులువైన విషయమేమీ కాదని.. కనుక అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రమణ్యం ఆరోగ్యంపై తనకు ఆందోళనగా ఉందని.. ఆయన వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు సునీత. 3,000కు పైగా పాటలు పాడి, 750 చిత్రాలకు డబ్బింగ్ చెప్పిన ఈ అద్భుత కళాకారిణి పాడిన పాటలు ఎన్నో ఇప్పటికీ శ్రోతల హృదయాలలో మారుమ్రోగుతూనే ఉంటాయి. ఇక సునీత అయితే.. తాను ఇప్పటికీ మంచి మంచి పాటలు పాడాలనుకుంటానని, ప్రతీ పాటను ప్రేమిస్తానని తన శక్తి ఉన్నంతవరకూ పాడడమే తన జీవిత లక్ష్యమని గతంలో చాలా సందర్భాల్లో తెలియ జేశారు. సో.. ఈ అందమైన గాయని గొంతు నుంచి మరిన్ని మంచి పాటలను వీలైనంత తొందరలోనే వినాలని ఆశిద్దాం.!



























